పార్క్‌లోకి చొరబడి గొరిల్లాను చంపేశాడు.. వేటగాడికి 11 ఏళ్ల జైలు శిక్ష

జూన్ 1న పార్క్‌లో గొరిల్లా కనిపించలేదు. ఆ మరుసటి రోజు దాని మృతదేహం అదే పార్క్‌లో కనిపించింది. పదునైన ఆయుధంతో దాన్ని శరీరాన్ని చిధ్రం చేశారని పోస్టుమార్టం నివేదికలో తేలింది.

news18-telugu
Updated: July 31, 2020, 8:17 AM IST
పార్క్‌లోకి చొరబడి గొరిల్లాను చంపేశాడు.. వేటగాడికి 11 ఏళ్ల జైలు శిక్ష
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ భూమి మీద గొరిల్లాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అరుదైన జంతు జాతిని కాపాడుకునేందుకు పలు దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి గొరిల్లాను చంపిన ఓ వ్యక్తికి కఠిన కారాగార శిక్ష పడింది. యుగాండాలో రఫికి అనే సిల్వర్ బ్లాక్ గొరిల్లాను చంపిన వేటగాడికి 11 జైలు విధించింది అక్కడి కోర్టు. కనుంగు డిస్ట్రిక్ట్‌లో బంది ఇంపెనెట్రేబుల్ నేషనల్ పార్క్ ఉంది. అందులో ఇతర జంతువులతో పాటు గొరిల్లా రఫికి కూడా ఉండేది. దాన్ని చూసేందుకు టూరిస్టులు భారీగా వచ్చేవారు. ఐతే జూన్ 1న పార్క్‌లో గొరిల్లా కనిపించలేదు. ఆ మరుసటి రోజు దాని మృతదేహం అదే పార్క్‌లో కనిపించింది. పదునైన ఆయుధంతో దాన్ని శరీరాన్ని చిధ్రం చేశారని పోస్టుమార్టం నివేదికలో తేలింది.

రఫికి మృతిని అక్కడి పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. స్థానికంగా ఉండే వేటగాళ్ల గురించి ఆరాతీస్తున్న క్రమంలో బ్యాముకాకా ఫెలిక్స్ పేరు బయటకువచ్చింది. అతడి ఇంట్లో తనిఖీ చేయడంతో అడవి పంది మాంసం, పదునైన ఆయుధాలు లభ్యమయ్యాయి. తమదైన స్టైల్లో విచారిస్తే ఫెలిక్స్ అసలు నిజాన్ని బయటకు కక్కాడు. కొంత మందితో కలిసి ఇటీవల పార్క్‌లో వేటకు వెళ్లామని.. ఆ సమయంలో గొరిల్లా సమూహం తమపై దాడికి ప్రయత్నించిందని చెప్పాడు. ఆ క్రమంలో ఆత్మరక్షణ కోసం రఫికిని చంపాల్సి వచ్చిందని నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడు గతంలోనూ పలు అడవి జంతువులను చంపినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఫెలిక్స్‌కు 11 జైలు శిక్ష విధించింది అక్కడి కోర్టు.
Published by: Shiva Kumar Addula
First published: July 31, 2020, 8:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading