THE PHILIPPINES HAS EXPRESSED CONCERN OVER A BRAHMOS MISFIRE INTO PAKISTAN IN MARCH WHAT IS THE RESON IN THAT GH VB
BrahMos Missile: బ్రహ్మోస్ మిసైల్ మిస్‌ఫైర్‌పై ఫిలిప్పీన్స్ ఆందోళన.. కారణం ఏంటి..? అసలు ఏం జరిగింది..?
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష
మార్చిలో పాకిస్థాన్‌లోకి(Pakistan) బ్రహ్మోస్(BrahMos Missile) మిస్‌ఫైర్ అవ్వడంపై ఫిలిప్పీన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఘటన జరిగిన వెంటనే మనీలాలోని భారత రాయబారి శంభు ఎస్ కుమారన్‌ను ఫిలిప్పీన్స్ రక్షణ కార్యదర్శి డెల్ఫిన్ లోరెంజానా సంప్రదించారు.
మార్చిలో పాకిస్థాన్‌లోకి(Pakistan) బ్రహ్మోస్(BrahMos Missile) మిస్‌ఫైర్ అవ్వడంపై ఫిలిప్పీన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఘటన జరిగిన వెంటనే మనీలాలోని భారత రాయబారి శంభు ఎస్ కుమారన్‌ను ఫిలిప్పీన్స్ రక్షణ కార్యదర్శి డెల్ఫిన్ లోరెంజానా సంప్రదించారు. ఇలా జరగడానికి గల కారణం ఏంటనే వివరాలను ఆరా తీశారు. బ్రహ్మోస్ మిసైల్(BrahMos Missile) వ్యవస్థలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదని లోరెంజానాకు కుమరన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిస్ ఫైరింగ్‌పై విచారణ జరిపి వివరాలను ఫిలిప్పీన్స్‌తో పంచుకొంటామని భారతదేశం హామీ ఇచ్చింది.
భారత్ నుంచి 'సూపర్సోనిక్ మిస్సైల్' ప్రయోగించారని పాకిస్థాన్ ఆరోపణ..
మార్చి 10న ఆయుధాలు లేని సర్ఫేస్ టూ సర్ఫేస్ మిసైల్ గగనతల నిబంధనలు ఉల్లంఘించి పంజాబ్ ప్రావిన్స్‌లో సూపర్సోనిక్ మిస్సైల్ ల్యాండ్ అయిందని పాకిస్థాన్ ఆరోపించింది. అయితే ఇది కేవలం సాధారణ నిర్వహణ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తు మిసైల్ మిస్‌ఫైర్ అయిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
అధికారిక విచారణ జరిపి మిస్‌ఫైర్‌కు గల కారణాలను నిర్ధారిస్తామని పార్లమెంటుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తమ ఆయుధ వ్యవస్థల కార్యకలాపాలు, తనిఖీలు, నిర్వహణకు సంబంధించిన ప్రామాణిక విధానాలను భారత్ సమీక్షిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నాడు. ప్రశ్నార్థకమైన మిసైల్‌ను గుర్తించనప్పటికీ.. పాకిస్థాన్ గగనతంలోకి ప్రవేశించిన సూపర్సోనిక్ మిసైల్ బ్రహ్మోస్ అని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇండియా- ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ డీల్..
బ్రహ్మోస్ షోర్ బేస్డ్ యాంటి షిప్ మిసైల్స్ సరఫరా కోసం భారతదేశంతో 375 మిలియన్ల డాలర్ల ఒప్పందంపై ఫిలిప్పీన్స్ సంతకం చేసింది. 2022 జనవరిలో సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ఎగుమతికి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (BAPL)తో మొదటి ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశం- రష్యా సంయుక్త వెంచర్ బ్రహ్మోస్.. జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, ల్యాండ్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి దీనిని ప్రయోగించవచ్చు. భారత్ ఇప్పటికే బ్రహ్మోస్ మిసైల్స్‌ను చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి వ్యూహాత్మక ప్రదేశాల్లో మోహరించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
'యాక్సిడెంటల్ ఫైర్' బ్రహ్మోస్ అమ్మకాలను దెబ్బతీస్తుందా..?
ఫిలిప్పీన్స్ ఒప్పందం తర్వాత బ్రహ్మోస్ కోసం వియత్నాం, ఇండోనేషియా ముందుకొస్తాయనే భావనలో ఇండియా ఉంది. ఫిలిప్పీన్స్‌కు మరిన్ని బ్రహ్మోస్ సిస్టమ్‌లు విక్రయించేందుకు భారత్ ఆసక్తిగా ఉందని సమాచారం. బ్రహ్మోస్ యాక్సిడెంటల్ ఫైర్‌తో ఇతర దేశాలకు భారతదేశం మిసైల్స్ విక్రయించే అవకాశాలపై ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ విక్రయాలు ద్వైపాక్షిక ప్రాతిపదికన కొనసాగుతాయని, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఎటువంటి ప్రభావాన్ని చూపదని ఫిలిప్పీన్స్‌లోని భారత రాయబారి తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.