హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Whisky: 250 సంవత్సరాల కాలం నాటి విస్కీ.. వేలంలో ఎంత ధర పలికిందో తెలుసా..

Whisky: 250 సంవత్సరాల కాలం నాటి విస్కీ.. వేలంలో ఎంత ధర పలికిందో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Whisky: సాధారణంగా మన దేశంలో విస్కీ బాటిల్ ధర వేలల్లో ఉంటుంది. విదేశాల్లో అయితే కంపెనీని బట్టీ రూ.లక్షల్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఓ విస్కీ బాటిల్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల కోటి రూపాలయలు. అసలు అంత ధర ఎందుకు పలికింది.. దానికి ఉన్న స్పెషాలిటీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

సాధారణంగా మన దేశంలో విస్కీ బాటిల్ ధర వేలల్లో ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువే ఉంటుంది. ఇక ప్రీమియమ్ మద్యం ధర రూ.10వేల వరకు ఉంటుంది. విదేశాల్లో అయితే కంపెనీని బట్టీ రూ.లక్షల్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ, ఒక మద్యం బాటిల్‌ అక్షరాలా కోటి రూపాయలకు అమ్ముడైంది. ఇది ప్రపంచంలోనే పురాతనమైంది విస్కీ బాటిల్‌. 250 సంవత్సరాల కాలం నాటి కిందటిది. దాని అసలు ధర కంటే ఆరు రెట్ల ధరకు వేలంలో అమ్ముడైంది. బాటిల్‌ను వేలం వేయగా.. భారత కరెన్సీలో రూ.1,02,63,019 పలికింది. అంటే 1,37,000 డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ విస్కీ బాటిల్ పేరు ఓల్డ్ ఇంగ్లెడ్వ్ . దీనిని 1860లో తయారు చేశారు. కానీ అందులో మద్యం మాత్రం వంద సంవత్సరాల క్రితంది అని భావిస్తున్నారు. ఇంగ్లాండ్ లోని ప్రముఖ వేలం సంస్థ స్కిన్నార్ ఇంక్ ఒక అతి పురాతనమైన విస్కీ బాటిల్ ను వేలం వేయగా ఒక 20 వేల డాలర్లు మాత్రమే వస్తాయని భావించినా.. అనుహ్యంగా జూన్ 30తో ముగిసిన వేలంలో ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మాన్హాటన్‌లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీకి 137,500 డాలర్లకు కొనుగోలు చేసింది.

ఈ బాటిల్ వెనుక భాగంలో ఉన్న ఒక లేబుల్ లో అక్షరాలు కనిపించాయి. అందులో ఏముందంటే..‘ఈ బౌర్బన్ బహుశా 1865 కి ముందే తయారు చేయచేసి ఉండవచ్చు. మిస్టర్ జాన్ పియర్‌పాయింట్ మోర్గాన్ గదిలో ఇది కనిపించింది. అతని మరణం తరువాత వారి ఎస్టేట్ నుండి సంపాదించబడింది’ అని రాసి ఉంది. ఈ విస్కీ దాదాపు 1770-1790 మధ్య కాలంలో ఏర్పడిన విస్కీ తిరుగుబాటుల చారిత్రక సందర్భంలో దీనిని ప్రదర్శించినట్టు భావిస్తున్నారు. ఇక్కడ వేలం వేసిన విస్కీ మాత్రం 1763-1803 మధ్య కాలంలో ఉత్పత్తి చేసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ బాటిల్ యొక్క ఆకారం చూస్తే.. ఇరుకుగా ఉండే ఉబ్బెత్తు మెడ ఆకారంలో ఉంది. అలాంటి బాటిల్ లు 1700 దశాబ్దపు కాలం నాటివి అని అంచనా వేస్తున్నారు. 1900ల్లో జార్జియా పర్యటనలో జేపీ మోర్గాన్‌ ఈ మద్యం బాటిల్‌ను కొన్నారని నిపుణులు భావిస్తున్నారు.

ఆ తర్వాత ఆయన తన కొడుకు ఇచ్చారని, అతను దాన్ని 1942-44 మధ్య దక్షిణ కరోలినా గవర్నర్‌ జేమ్స్‌ బైర్నెస్‌కు ఇచ్చారు. 1955లో పదవీ విరమణ చేసిన తర్వాత.. ఆయన దాన్ని స్నేహితుడు, ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్‌ డ్రేక్‌కు పంపారు. ఆయన దాన్ని మూడు తరాల పాటు కాపాడారు. అయితే కోటి రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్న ఈ విస్కీ మాత్రం తాగేందుకు పనికిరాదని.. కేవలం దాచుకోవాడానికి మాత్రమే ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా విస్కీలోని మద్యం మూత తీయకుండా పది సంవత్సరాల లోపు ఉపయోగించాలిని వారు తెలిపారు.

First published:

Tags: England, International news, Wine

ఉత్తమ కథలు