Home /News /international /

THE MAN WHO WENT TO THE BATHROOM WAS A PYTHON WITH A MYSTERIOUS CUT VB

Python in Bathroom: బాత్రూంలో టాయిలెట్ సీటుపై కూర్చున్న వ్యక్తి .. కిందకు చూసి వణికిపోయాడు.. అసలేం జరిగిందంటే..

బాత్రూంలోకి చేరిన కొండచిలువ

బాత్రూంలోకి చేరిన కొండచిలువ

Python in Bathroom: చాలామందికి బాత్రూంలో బల్లి, బొద్దింక లాంటివి కినిపిస్తేనే అమ్మో అని అరుస్తారు. కానీ అదే బాత్రూంలో ఓ కొండ చిలువ ప్రత్యక్షమైతే ఇంకేమైనా ఉందా.. నోటి నుంచి మాట కూడా రాదు. ఇలాంటి ఘటనే ఒక్కటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    సాధారణంగా ఎవరికైనా పాములు అంటే చాలా భయంగా ఉంటుంది. ఒక్కసారి పాము ఆ ప్రదేశంలో కనిపించిందంటే అటువైపు వెళ్లడం కూడా మానేస్తాం. అయితే, ఒక్కొసారి పాములు, కొండ చిలువలు ఆహారం కోసం లేదా ఆవాసం కోసం మనిషి ఇళ్లలోనికి ప్రవేశిస్తున్న సంఘటనలను మనం తరచుగా చూస్తునే ఉంటాం. ఇలాంటి షాకింగ్‌ ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలోని గ్రాజ్‌ ప్రాంతలో 65 ఏళ్ల ఒక వ్యక్తి ఉదయం 5 గంటలకు నిద్రలేచాడు. లేచి ఎప్పటిలాగే కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంకు వెళ్లాడు. కానీ అక్కడ షాకింగ్ సంఘటనను ఎదుర్కొన్నాడు. టాయిలెట్ సీటు మీద కూర్చున్నప్పుడు అతని మర్మాగాన్ని ఎదో కరిచినట్టు అనిపించింది. వెంటనే కిందకు చూశాడు. అంతే ఓ ఐదు అడుగుల కొండచిలువను చూసి షాక్ కు గురయ్యాడు. భయంతో వణికిపోయాడు.

    వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. అతడి ప్రాణానికి ఎలాంటి నష్టం జరగలేదు కానీ స్వల్ప గాయాలు మాత్రం అయ్యాయి. దీంతో బాధితుడు జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తన ఇంటిపక్కన ఉండే 24 ఏళ్ల యువకుడు కొండ చిలువల్ని, పాములను పెంచుతున్నాడని గుర్తించారు. అతని అపార్ట్‌ మెంట్లో దాదాపు 11 రకాల విషపూరిత పాములు ఉన్నాయని పోలీసులు కనుగొన్నారు. ఆ కొండ చిలువ డ్రైనేజీ నీటితో అక్కడకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కొండ చిలువ కాటుతో ప్రాణానికి పెద్దగా ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు.

    ఆ వృద్ధుడిని, కాటు వేసిన కొండ చిలువ కొన్ని రోజుల ముందు తప్పిపోయిందని ఆ యువకుడు విచారణలో తెలిపాడు. కొండ చిలువ బాత్రూంలో కాటువేసిన తర్వాత అది కాలువ లోనికి వెళ్లి తప్పించుకుంది.ఆ యువకుడు నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వెంటనే పాములను పట్టేవారికి సమాచారం అందించారు. కాగా, ఆగ్నేయాసియాలో ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువలు ఉంటాయి. ఇవి మానవులకు పెద్దగా హని కలిగించవు. అయితే నిర్లక్షంగా వ్యవహరించినందుకు పాములను పెంచుకునే అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Australia, Python

    తదుపరి వార్తలు