పవన్ కల్యాణ్ పాటకు... జెన్నిఫర్ లోపెజ్ ఫిదా

ఇప్పుడు జెన్నిఫర్ లోపెజ్ స్వయంగా పవన్ పాటకు ఫిదా అయిపోయింది. అయితే జల్సా పాటకు కాదులేండి.పవన్ కల్యాణ్ చేసిన మరో సినిమాలోని పాటకు ఆ భామ పడిపోయింది.

news18-telugu
Updated: May 7, 2019, 7:42 AM IST
పవన్ కల్యాణ్ పాటకు... జెన్నిఫర్ లోపెజ్ ఫిదా
జెన్నిఫర్ లోపెజ్ ( ఫైల్ ఫోటో)
  • Share this:
‘జెన్నిఫర్ లోపెజ్‌కు స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి అంటూ’ పవన్ కల్యాణ్ జల్సా సినిమాలో పార్వతీ మెల్టన్‌తో పాడిన ఓ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది.అయితే ఇప్పుడు జెన్నిఫర్ లోపెజ్ స్వయంగా పవన్ పాటకు ఫిదా అయిపోయింది. అయితే జల్సా పాటకు కాదులేండి.పవన్ కల్యాణ్ చేసిన మరో సినిమాలోని పాటకు ఈ పాప్ డాన్సర్ పడిపోయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. పవన్ అంటే పడి చచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక తమ అభిమాన హీరో పాటలన్నా కూడా ప్రాణం తీస్తారు. సినిమా ఆడిన ఆడకపోయిన... ఆ మూవీ పాటల్ని మాత్రం హిట్ చేస్తారు. అలాంటి పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ పాటకు కొందరు భారతీయ యువకులు చేసిన డాన్స్‌ చూసి అంతర్జాతీయ డ్యాన్సింగ్ సెన్సేషన్, సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ సైతం ఫిదా అయ్యింది. ఓ ఇంటర్నేషనల్ చానల్‌లో వరల్డ్ ఆఫ్ డాన్స్ అనే రియాల్టీ షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జెన్నిఫర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలోముంబైకు చెందిన ఓ టీం పాల్గొంది. దకింగ్స్ అనే గ్రూప్ నేమ్‌తో కుర్రాళ్ల టీం డాన్స్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలోని ‘వాడెవన్నా వీడెవన్నా’ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు భారత యువకులు.

ఫినాలో షో సందర్భంగా సర్దార్ పాటకు ‘300’ అనే సినిమా కాన్సెప్ట్‌ను మిక్స్ చేశారు. వీళ్లు డాన్స్ చేసినంత సేపు షో మొత్తం ఒకటే హడావుడి కనిపించింది. షోలో పాల్గొన్న ప్రేక్షకులతో పాటు... జడ్జీలు సైతం కుర్రాళ్ల స్టెప్పులకు మంత్రముగ్ధులైపోయారు. వీళ్ల పెరఫామెన్స్ ముగియగానే.. జెన్నిఫర్ నిలబడీ మరీ చప్పట్లు కొట్టారు. 'ద కింగ్స్' బృందం ప్రదర్శించిన థ్రిల్స్, స్టెప్పులు చూసి చూసి ఈ పాప్ డాన్సర్ తన ఎమోషన్ కంట్రోల్ చేయలేకపోయింది.తన సీట్లోంచి పైకి లేచి మరీ 'ద కింగ్స్' ప్రదర్శన పట్ల జోరుగా చప్పట్లు కొట్టారు. ఆమె పక్కనే ఉన్నా ఇతర న్యాయనిర్ణేతలు సైతం ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First published: May 7, 2019, 7:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading