హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Impact On Currency: ఈ రెండు దేశాల యుద్ధ ప్రభావం.. ఆ దేశ కరెన్సీపై పడింది.. అక్కడ ఏం జరిగిందంటే..

Impact On Currency: ఈ రెండు దేశాల యుద్ధ ప్రభావం.. ఆ దేశ కరెన్సీపై పడింది.. అక్కడ ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) దేశాల మధ్య యుద్ధం కారణంగా.. ఈ ప్రభావం ఇతర దేశాలపై పడుతోంది. దీంతో కొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలతో మధ్య ఆసియా దేశాలకు కష్టాలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు సరిహద్దులను దాటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఇంకా చదవండి ...

ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) దేశాల మధ్య యుద్ధం కారణంగా.. ఈ ప్రభావం ఇతర దేశాలపై పడుతోంది. దీంతో కొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలతో మధ్య ఆసియా దేశాలకు కష్టాలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు సరిహద్దులను దాటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రష్యాపై ఆంక్షలతో మధ్య ఆసియా దేశాల(Asian Countries) ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలను పెరుగుతున్నాయి. ఈ ఉక్రెయిన్‌ వివాదంతో రష్యాపై ఆధారపడిన ఆసియా దేశాలకు రానున్న కాలంలో కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధం కారణంగా రష్యాపై కజకిస్థాన్ కరెన్సీ(Currency), బంగారం(Gold) ఔట్‌ఫ్లోను నియంత్రించాలని రష్యా ఎకనామిక్‌ క్రైసిస్‌తో మార్చి 14న ఆదేశించింది. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలైనప్పటి నుంచి కజకిస్థాన్ కరెన్సీ టెంగే 20 శాతం పతనం అయింది.

ఇలా తమ కరెన్సీ పతనమైపోతున్న నేపథ్యంలో కరెన్సీ నిల్వలను ఉపయోగించుకోవాలని కజకిస్థాన్ భావిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన కొద్ది గంటలకే బేస్‌లైన్ వడ్డీ రేటును 10.25 శాతం నుంచి 13.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రష్యాపై యూఎస్ ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావంపై కజకిస్థాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. జనవరిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 225 మంది మరణించిన తర్వాత కజకిస్థాన్ లో ఆర్థిక సవాళ్లు ఎదరయ్యాయి. దీంతో పాటు.. తజికిస్థాన్, కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లోనూ నిరుద్యోగం పెరిగిపోయింది. బడ్జెట్ లోటు సమస్యలున్నట్లు రిపోర్ట్స్‌ వస్తున్నాయి.

Explained: ఎక్కువ మంది ఉక్రెయిన్‌ శరణార్థులను అమెరికా ఎందుకు అనుమతించట్లేదు..? దీని వెనుక ఉన్న కారణాలు ఏవి..?


రష్యాలోని మధ్య ఆసియా కార్మికులపై ప్రభావం ఎంత..?

ఆంక్షలను ఎదుర్కొనేందుకు క్రెమ్లిన్‌ తీసుకొనే చర్యలతో మధ్య ఆసియా కార్మికులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు పేర్కొంటున్నారు. 2021 జనవరి- సెప్టెంబరులో ఉజ్జెకిస్థాన్‌ నుంచి 3, తజకిస్థాన్‌ నుంచి 1.6 మిలియన్లు, కిర్గిస్థాన్‌ నుంచి 620,000 మంది కార్మికులు రష్యాలో అడుగుపెట్టినట్లు సమాచారం. 2019లో రష్యాలో పనిచేస్తున్న కార్మికులు స్వదేశాలకు పంపిన మొత్తం 2.6 బిలియన్‌ డాలర్లు.. అప్పుడు మూడు రెట్లు తజకిస్థాన్ ఎగుమతులు పెరిగాయి. రష్యా చెల్లింపుల వాటా తజికిస్థాన్ జీడీపీలో 30, కిర్గిస్థాన్‌ జీడీపీలో 28, ఉజ్బెకిస్థాన్‌ జీడీపీలో 12 శాతంగా ఉన్నాయి.

రష్యాలో పనిచేస్తున్న కార్మికులకు చెల్లింపులు తగ్గితే మధ్య ఆసియా దేశాలలో సామాజిక, రాజకీయ తిరుగుబాట్లకు అవకాశం ఏర్పడుతుంది. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకొన్న రష్యాపై ఇతర దేశాలు విధించిన ఆంక్షలతో చెల్లింపులు 40 శాతం తగ్గాయి. మూడింట రెండు వంతుల ఆయిల్‌ ను రష్యా ఓడరేవులపైనే కజకిస్థాన్ ఎగుమతి చేస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి రష్యా దూరమైతే కరోనా తర్వాత రికవరీ అవుతున్న మధ్య ఆసియా ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఏర్పడుతుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే మధ్య ఆసియా కార్మికులు తిరిగివెళ్లక తప్పదని నిపుణులు చెబుతున్నారు.

రష్యా యుద్ధంలోకి మధ్య ఆసియా దేశాలు వస్తాయా..?

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా-సెంట్రిక్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (CSTO) సభ్యులు భాగమవుతారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోవియట్ యూనియన్ నుంచి మధ్య ఆసియా దేశాలు విడిపోయిన వెంటనే పరస్పర రక్షణ ఒప్పందం ఏర్పడింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో తమ భూభాగాన్ని రష్యాకు CSTO దేశమైన బెలారస్‌ సహకరించింది. ఉక్రెయిన్‌ యుద్ధంలో లక్ష్యాలను రష్యా అందుకోలేకపోతే CSTO సభ్య దేశాల మద్దతు అవసరం ఏర్పడుతుంది. ఉక్రెయిన్‌ నగరాలను ఆక్రమించాక CSTO దేశాల దళాలను రష్యా మోహరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. జనవరిలో కజకిస్థాన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలవగా CSTO శాంతి పరిరక్షణ దళాలను పుతిన్ మోహరించారు.

ఈ సంక్షోభాలను చైనా అవకాశంగా భావిస్తుందా..?

మధ్య ఆసియాలో చైనా బలోపేతం అవుతుండటంపై ఆయా దేశాల ఆందోళన చెందుతున్నాయి. షీ జిన్‌పింగ్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) నిర్మాణంలో మధ్య ఆసియా కీలకం కానుంది. మధ్య ఆసియా దేశాలలో 2020 చివరికి 40 బిలియన్ల డాలర్లకు చైనా పెట్టుబడులు చేరాయి. జనవరిలో కజకిస్థాన్‌లో మొదలైన తిరుగుబాటును సైతం డ్రాగన్‌ దేశం నిశితంగా పరిశీలించింది. తిరుగుబాటు పశ్చిమ దేశాల మద్దతుతో కూడిన వర్ణవిప్లవమని, కజకిస్థాన్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతిచ్చామని చైనా అధికారులు పేర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేలా తజకిస్థాన్‌లో చైనా ఔట్‌పోస్ట్‌ ను నిర్మిస్తోంది.

Holika Dahan: హోలీ వేడుకలకు సిద్ధమవుతున్న భారతీయులు.. పూజా పద్ధతులు, శుభ గడియల వివరాలు..


ఆఫ్ఘనిస్థాన్‌, జింజియాంగ్ నగరం మధ్య బఫర్‌లా తజకిస్థాన్ పని చేస్తోంది. 1.8 మిలియన్ల మంది టర్కిక్ మైనారిటీలను చైనా నిర్బంధించింది. తజకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులో భారీగా సైనిక స్థావరాలు ఏర్పాటు బీజింగ్ ఏర్పాటు చేసింది. మధ్య ఆసియాతో రష్యా వాణిజ్యం 18.6 బిలియన్ల డాలర్లు, ఇది చైనా వాణిజ్యంలో మూడింట రెండు వంతులు. తజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ జాతీయ రుణాలలో 40 శాతం అందించిన చైనా, మరిన్ని భద్రతా రాయితీలను పొందుతోంది. రష్యాను దెబ్బతీసేందుకు మధ్య ఆసియాలోని అస్థిరతను పశ్చిమ దేశాలూ ఉపయోగించుకొనే అవకాశం ఉందని నిపుణుల చెబుతున్నారు.

First published:

Tags: Currency, Russia-Ukraine War, Ukraine, War

ఉత్తమ కథలు