హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan: మీడియాపై పాక్​ ప్రభుత్వం ఆంక్షలు.. ఇకపై వార్తలు ప్రసారం చేసే ముందు ఆ పని చేయాలంటూ..

Pakistan: మీడియాపై పాక్​ ప్రభుత్వం ఆంక్షలు.. ఇకపై వార్తలు ప్రసారం చేసే ముందు ఆ పని చేయాలంటూ..

ఇమ్రాన్​ఖాన్​ (ఫైల్​)

ఇమ్రాన్​ఖాన్​ (ఫైల్​)

పాకిస్తాన్ ప్రభుత్వం (Pakistan government) ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియో (Electronic media)కు కీలక ఆదేశాలు జారీచేసింది. అన్ని శాటిలైట్ టీవీ ఛానల్స్ (satellite Tv channels) ఈ సిఫార్సులు పాటించాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది.

పాకిస్తాన్ ప్రభుత్వం (Pakistan government) ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియో (Electronic media)కు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రతి రోజూ రాత్రి 9 గంటల న్యూస్ బులెటిన్‌కు ముందు పాకిస్తాన్ మ్యాప్‌ (Pakistan map)ను ప్రసారం చేయాలని అన్ని టీవీ ఛానెల్‌లను ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) ఉత్తర్వులు జారీ చేసింది.  అన్ని వార్తా ఛానెల్‌లు (ప్రభుత్వ, ప్రైవేట్) రోజూ రాత్రి 09:00 గంటల న్యూస్ బులెటిన్‌ ప్రసారం చేయడానికి ముందు 2 సెకన్ల పాటు (Two seconds) పాకిస్తాన్ పొలిటికల్ మ్యాప్‌ను ప్లాష్ చేయాలని పెమ్రా లేఖ (letter) విడుదల చేసింది. అన్ని శాటిలైట్ టీవీ ఛానల్స్ (satellite Tv channels) ఈ సిఫార్సులు పాటించాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ  (Ministry of Information and Broadcasting)సూచనను కూడా లేఖలో పెమ్రా పేర్కొంది.  పాకిస్తాన్‌లోని వార్తా ఛానెళ్లను వివిధ ఆర్డర్‌ల ద్వారా అణిచివేసేందుకు పెమ్రా ప్రయత్నించిందని గతంలో ఆరోపణలు వచ్చాయి.

డాన్ వార్త పత్రిక కథనాల ప్రకారం..

నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (National Accountability Bureau) గురించి, ప్రభుత్వ పాలనను కించపరిచే ఉద్దేశ్యంతో నిరాధారమైన, ఏకపక్షమైన అభిప్రాయాలను ప్రసారం చేయకూడదని మార్చిలో పాక్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించింది. డాన్ వార్త పత్రిక కథనాల ప్రకారం... పెమ్రా నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్‌ను ప్రసారం చేస్తే PEMRA (సవరణ) చట్టం 2007, పెమ్రా నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది.

కాగా, గతంలోనూ పాక్​ మీడియా ఛానళ్ల (Pak media channels)కు ఓ నిబంధన విధించింది. స్థానిక టీవీ సీరియళ్లపై పాక్‌ ప్రభుత్వం కత్తెర వేటు వేయనుంది. ఇకనుంచి తమ సీరియళ్లలో కౌగిలింతలు, ఇతరత్రా సన్నిహిత దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(పీఈఎంఆర్‌ఏ) తాజాగా టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా కంటెంట్‌పై పౌరుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పైగా, సదరు కార్యక్రమాలు పాకిస్థాన్ సమాజపు అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని తెలిపింది.

పరువు హత్యలపై స్పందనేది?

సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం తదితరమైనవి ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నాయని పీఈఎంఆర్‌ఏ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అన్ని టీవీ ఛానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని, సంబంధిత దృశ్యాలను కత్తిరించాలని ఆదేశించింది. శాటిలైట్ టీవీ లైసెన్సుదారులందరూ పీఈఎంఆర్‌ఏ నియమ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. పరువు హత్యలు, మహిళలపై వేధింపులు తదితర అంశాలను పట్టించుకోని కొంతమంది స్పందనను పీఈఎంఆర్‌ఏ పరిగణనలోకి తీసుకుందని విమర్శిస్తున్నారు.

First published:

Tags: Imran khan, Pakistan, TV channels

ఉత్తమ కథలు