Home /News /international /

THE GOVERNMENT OF INDIA HAS IMPOSED HIGH TARIFFS ON THE IMPORT OF CHEAP GOODS FROM CHINA PRV

China-India: చైనాను మరోసారి దెబ్బకొట్టిన భారత్​.. యాప్స్​ బ్యాన్​ చేశాక రెండో సారి డ్రాగన్​ దేశానికి షాక్​..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ఓ వైపు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, అంతర్జాతీయ స్థాయిలో భారత్​కు వ్యతిరేకంగా నిలబడుతున్న చైనా .. భారత్​ (India)లో మాత్రం వ్యాపారం బాగా చేసుకుంటోంది. దీంతో భారత్​ చైనాకు జలక్​ ఇచ్చింది.

    డ్రాగన్​ దేశం చైనా (China) కు ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. ఓ వైపు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, అంతర్జాతీయ స్థాయిలో భారత్​కు వ్యతిరేకంగా నిలబడుతున్న చైనా .. భారత్​ (India)లో మాత్రం వ్యాపారం బాగా చేసుకుంటోంది. దీంతో భారత్​ చైనాకు జలక్​ ఇచ్చింది. ఇప్పటికే చైనా యాప్​లను బ్యాన్​ చేసిన భారత్​ ఇపుడు మరో అడుగు ముందుకేసింది. స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి చైనా నుంచి చౌక ధరలకు దిగుమతి అవుతున్న ఐదు రకాల చైనా ఉత్పత్తులపై (china products) యాంటీడంపింగ్ సుంకాలను విధించింది. ఈ యాంటీడంపింగ్ సుంకాలు (Antidumping tariffs) ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి. ఈ మేరకు ది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(The Central Board of Indirect Taxes and Customs) ఒక ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీబీఐసీ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ వస్తువుల జాబితాలో అల్యూమినియం, సోడియం హైడ్రోసల్ఫేట్‌ (Aluminum, sodium hydrosulfate‌), సిలికాన్‌ సీలెంట్‌ (సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్, థర్మల్ పవర్ అప్లికేషన్ తయారీ కోసం వాడుతారు), హైడ్రోఫ్లోరో కార్బన్‌, కాంపొనెంట్‌ ఆర్‌-32, హైడ్రోఫ్లోరో కార్బన్‌ మిశ్రమాలు ఈ సుంకాల పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.

    సుంకాలు..

    వాణిజ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) సిఫార్సుల నేపథ్యంలో ఈ సుంకాలు (tariffs) విధించారు. ఈ ఉత్పత్తులు భారతీయ మార్కెట్లలో సాధారణ విలువ కంటే తక్కువ ధరకు ఎగుమతి అవుతున్నాయని, దీని ఫలితంగా డంపింగ్ జరిగిందని డీజీటిఆర్ వేర్వేరు దర్యాప్తులలో నిర్ధారించింది. "ఈ నోటిఫికేషన్ కింద విధించిన యాంటీ డంపింగ్ సుంకం (సిలికాన్ సీలెంట్ పై) ప్రచురించిన తేదీ నుంచి 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఈ సుంకం భారతీయ కరెన్సీ (Indian Rupee)లో చెల్లించాల్సి ఉంటుంది" అని సీబీఐసీ తెలిపింది.

    ఐదేళ్లపాటు..

    చవకైన చైనా దిగుమతుల (Inexpensive China imports) నుంచి దేశీయ తయారీదారులను రక్షించడానికి ట్రయిలర్స్ కోసం యాక్సిల్ - వాహన భాగంపై కూడా సీబీఐసీ సుంకాన్ని విధించింది. అదేవిధంగా ఇరాన్, ఒమన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి దిగుమతి అవుతున్న కాల్సినేడ్ జిప్సమ్ పౌడర్ దిగుమతులపై కూడా ఐదేళ్లపాటు సుంకాన్ని విధించింది. సాధారణంగా యాంటీ డంపింగ్‌ డ్యూటీలను ప్రపంచ వాణిజ్య సంస్థ (World Trade Organization) నిబంధనల మేరకే విధిస్తారు. చౌకరకం దిగుమతుల కారణంగా దేశీయ పరిశ్రమలు దెబ్బతినే పరిస్థితుల్లో వీటిని వసూలు చేస్తారు. ఫలితంగా దేశీయ పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి అవసరమైన మార్కెట్‌ పరిస్థితులు ఏర్పడతాయి.

    మరోవైపు భారత మార్కెట్‌ను శాసిస్తున్న.. చైనా బ్రాండ్‌ ఫోన్ల విషయంలో ఉక్కుపాదం మోపాలని గతంలోనే నిర్ణయించుకుంది. ఈ మేరకు వివో, ఒప్పో, షావోమీ, వన్‌ఫ్లస్‌ కంపెనీలను పరిశీలన విభాగం కిందకు తీసుకొచ్చి మరీ నోటీసులు ఇంతకుముందే పంపించింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: BUSINESS NEWS, India-China

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు