THE GIRLFRIEND WHO DELIVERED A THOUSAND KILOS OF ONION DOOR TO TELL HER LOVE WAS A BREAKUP BN
బ్రేకప్ చెప్పిన ప్రియుడు.. వెయ్యి కిలోల ఉల్లిగడ్డలు డోర్ డెలీవరి చేసిన ప్రియురాలు
షీబా సువితా అనే ప్రభుత్వ ఆస్పత్రిలో కౌన్సిలర్, సెంథిల్ కుమార్ అనే యువకుడికి తమిళనాడులోని పొన్నేరిలో వివాహం జరిగింది. ఆ పెళ్లి రిసెప్షన్‌కు చాలా మంది అతిథులు హాజరై వధూవరులకు బహుమతులు ఇచ్చారు.
మూడు రోజుల పాటు అదేపనిగా కుమిలిపోయి ఏడ్చింది. అయితే తను ఇంతగా బాధపడుతున్నా.. తన ప్రియుడు ఏ మాత్రం బాధ లేకుండా ఉన్నాడంట. దీంతో ఏలాగైనా తన ప్రియుడిని కూడా బాధ పెట్టాలని జావో నిర్ణయించుకుంది.
వారిద్దరూ ప్రేమికులు. ఒకరినొకరు ఏడాదిపాటు గాఢంగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో గానీ ప్రియుడు ప్రియురాలు జావోకు బ్రేకప్ చెప్పాడు. దీంతో ఆమె మానసికంగా ఎంతో కుంగిపోయింది. మూడు రోజుల పాటు అదేపనిగా కుమిలిపోయి ఏడ్చింది. అయితే తను ఇంతగా బాధపడుతున్నా.. తన ప్రియుడు ఏ మాత్రం బాధ లేకుండా ఉన్నాడంట. దీంతో ఏలాగైనా తన ప్రియుడిని కూడా బాధ పెట్టాలని జావో నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ప్రియుడి ఇంటికి వెయ్యి కిలోల ఉల్లిపాయలను అతడి ఇంటికి డెలివరీ చేసింది. అదీ కూడా అతడికి తెలియకుండా ఉల్లి పాయలను ఇంటి గుమ్మం దగ్గర ఉల్లిపాయ బస్తాలను వేసి రమ్మని డెలివరీ బాయ్‌కు చెప్పింది. ‘నేను మూడు రోజుల పాటు ఏడ్చా. ఇక ఇప్పుడు నీ వంతు’ అనే సందేశాన్ని కూడా పంపించింది. ఈ ఘటన ఈస్ట్రన్ చైనాలోని జిబోలో చోటుచేసుకుంది. ఉల్లిపాయల డోర్ డెలివరీపై ప్రియుడు స్పందిస్తూ.. జావోకు పొగరు ఎక్కువని, అందుకే ఇలా డ్రామా చేస్తుందన్నాడు. బ్రేకప్ తర్వాత నేను ఏడ్వలేదని అందరికీ చెప్పిందని, నేను ఏ మాత్రం బాధపడడం లేదని చెప్పిందని తెలిపాడు. ఇదిలావుంటే.. ఇంటి గుమ్మం వద్ద ఉన్న వెయ్యి కిలోల ఉల్లిపాయలను ప్రియుడు అయోమయంతో చూస్తున్న ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.