Harvest Moon: నేడు పౌర్ణమి... దీన్ని హార్వెస్ట్ మూన్ అని ఎందుకు పిలుస్తున్నారు?

September Full Moon: సెప్టెంబర్‌లో వచ్చే సంపూర్ణ చందమామను... హార్వెస్ట్ మూన్ అని పిలుస్తున్నారు. ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయి.

news18-telugu
Updated: September 1, 2020, 11:25 AM IST
Harvest Moon: నేడు పౌర్ణమి... దీన్ని హార్వెస్ట్ మూన్ అని ఎందుకు పిలుస్తున్నారు?
నేడు పౌర్ణమి... దీన్ని హార్వెస్ట్ మూన్ అని ఎందుకు పిలుస్తున్నారు?
  • Share this:
September Harvest Moon: ప్రతి నెలలో ఏదో ఒక రోజున చందమామ సంపూర్ణంగా కనిపిస్తుంది. ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తుంది. 15 రోజుల పాటూ... చందమామ క్రమంగా తగ్గిపోతూ... ఆ తర్వాత కాంతి పెరుగుతూ... 30 రోజులకు సంపూర్ణ చందమామగా కనిపిస్తుంది. ఆ చందమామ చూసేందుకు చాలా పెద్ద సైజులో ఉన్నట్లు కనిపించడమే కాదు... ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఈసారి సెప్టెంబర్ 1, మంగళవారం, 2న బుధవారం నాడు సంపూర్ణ చందమామ రాబోతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) ప్రకారం... అటమ్నల్ ఈక్వినాక్స్‌ (Autumnal Equinox)లో ఇదే చివరి సంపూర్ణ చందమామ.

బుధవారం వచ్చే ఫుల్‌ మూన్‌ని సంప్రదాయం ప్రకారం... హార్వెస్ట్ మూన్ అంటున్నారు. ఈక్వినాక్స్ సమయంల వచ్చే పౌర్ణమిని ఇలా పిలుస్తారు. ఈ రోజున... పగలు, రాత్రి దాదాపు సమానంగా ఉంటాయి. టెక్నికల్‌గా అక్టోబర్ 1, 2020న వచ్చే పౌర్ణమిని... అసలైన హార్వెస్ట్ మూన్ అంటారు. ఐతే... రెగ్యులర్‌గా అక్టోబర్‌లో వచ్చే పౌర్ణమిని హంటర్స్ మూన్ (వేటగాళ్ల మూన్) అని పిలుస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 1న వచ్చేది హార్వెస్ట్ మూన్. అక్టోబర్ 31 రాబోయేది హంటర్స్ మూన్.

సెప్టెంబర్ 1, 2న రాబోయే పౌర్ణమిని కార్న్ మూన్ అని కూడా పిలుస్తున్నారు. ఈ సమయంలో... పంటలు చేతికొస్తాయి. అందువల్ల దీన్ని కార్న్ మూన్, హార్వెస్ట్ మూన్ అంటుంటారు. దీన్నే విదేశాల్లో బార్లీ మూన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సమయంలో... బార్లీ పంట చేతికొస్తుంది.

సెప్టెంబర్ 2న న్యూయార్క్‌లో రాత్రి 8.08కి సంపూర్ణ చందమామ కనిపించనుంది. అదే ఇండియాలో సెప్టెంబర్ 1న రాత్రి 9.38కి సంపూర్ణ చందమామ కనిపిస్తుంది. తిరిగి సెప్టెంబర్ 2న ఉదయం 10.51 వరకూ పౌర్ణమి ఉంటుంది. ఆ తర్వాత చందమామ క్రమంగా చిన్నదవుతూ ఉంటుంది. చిన్నది అంటే... సైజ్ తగ్గదు. చందమామపై సూర్యకాంతి పడకుండా... భూమి అడ్డం వస్తూ ఉంటుంది కదా అది.
Published by: Krishna Kumar N
First published: September 1, 2020, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading