హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Cook island: రెండేళ్ల నుంచి ఆ దీవిలో ఒక్క కరోనా కేసూ లేదు.. కానీ, ఇప్పుడొచ్చింది ఎలాగంటే..

Cook island: రెండేళ్ల నుంచి ఆ దీవిలో ఒక్క కరోనా కేసూ లేదు.. కానీ, ఇప్పుడొచ్చింది ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో అయితే కరోనా లేని గ్రామమే దొరకదు.  కరోనా వైరస్‌ బయట పడిన రెండేళ్లకు దక్షిణ పసిఫిక్‌ దేశంలోని ఒక దీవిలో తొలికేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

కరోనా (corona) ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మందిని కోవిడ్​ బలి తీసుకుంది. చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోయాయి. పలు దేశాలు లాక్​డౌన్​లను విధించాయి. కరోనా రెండో వేవ్ (Corona Second wave)​ చాలా దేశాల్లో వచ్చింది. ఇక మూడో వేవ్​ వస్తుందేమో అని ఇప్పటికే పలు దేశాలు ఆందోళనగా ఉన్నాయి. కాగా, కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికే మూడో వేవ్​ రాగా.. అక్కడ కరోనా నాలుగో వేవ్​ కూడా తలుపుతడుతోంది. రష్యా (Russia) కోవిడ్ విజృంభణతో విలవిలాడుతోంది. గత కొన్ని రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ రోజువారీ కేసులు (corona cases) భారీగా నమోదవుతున్నాయి. అంతేకాదు రోజుకు వెయ్యికి మందికి పైగా కరోనాతో మరణిస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికా (South Africa)లో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ (Omicron variant).. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది.

ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ (Britain)​ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్​ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు బయటపడిని విషయం తెలిసిందే. ఇక ఇండియాలో అయితే కరోనా లేని గ్రామమే దొరకదు.  కరోనా వైరస్‌ బయట పడిన రెండేళ్లకు దక్షిణ పసిఫిక్‌ దేశంలోని ( South Pacific country) ఒక దీవిలో తొలికేసు (first covid case) నమోదైంది. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

ఆ దీవిలో 17 వేల మంది..

దక్షిణ పసిఫిక్‌ దేశం ( South Pacific country)లో కుక్‌ ఐలాండ్‌ అనే దీవి ఉంది. ఆ దీవిలో 17 వేల మంది జనాభా ఉన్నారు. కరోనా వెలుగు చూసిన నాటి నుంచి ఆ దీవిలో కరోనా ఆంక్షలు, టీకాలు వేసుకునేలా ఆ దీవి ప్రధాని మార్క్‌ బ్రౌన్‌  (Prime Minister Mark Brown)  అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు ఆ దీవిలో 96 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాలు వేసుకున్నారు. కొత్తగా న్యూజిలాండ్‌ (New Zealand) నుంచి వచ్చిన పదేళ్ల బాలుడి (Boy)లో కరోనా వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆ బాలుడి కుటుంబం న్యూజిలాండ్‌ నుంచి, కుక్‌ ఐలాండ్‌ (cook Island) దీవికి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.

ప్రత్యేకంగా ఐసోలేషన్‌..

వెంటనే బాలుడిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచారు. వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్థానిక వైద్య సిబ్బంది తెలిపారు. వారి రిపోర్టు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కుక్‌ ఐలాండ్‌ దీవికి పర్యాటకులను అనుమతించే క్రమంలో తొలి కేసు నమోదుకావడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ప్రపంచం వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా, ఆ దేశ ప్రధాని ప్రధాన మంత్రి మార్క్ బ్రౌన్ (Prime Minister Mark Brown) మాట్లాడుతూ.. న్యూజిలాండ్​ నుంచి వచ్చిన బాలుడికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు. కాగా, దేశ సరిహద్దులోనే ఆ బాలుడికి కరోనా వచ్చినట్లు గుర్తించామని, ఇది కోవిడ్​ జాగ్రత్తల పట్ల తమ నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు.

First published:

Tags: Corona, Corona cases, Covid cases, New Zealand

ఉత్తమ కథలు