హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

EU Slaps Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు బిగ్ షాక్.. ఎన్ని వేల కోట్ల ఫైన్ కట్టాలంటే..

EU Slaps Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు బిగ్ షాక్.. ఎన్ని వేల కోట్ల ఫైన్ కట్టాలంటే..

అమెజాన్ లోగో

అమెజాన్ లోగో

ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రైవసీ ఉల్లంఘన కింద అమెజాన్‌కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది. ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు అమెజాన్ 886 మిలియన్ డాలర్లు జరిమానా కట్టాలని యూరోపియన్ యూనియన్ ఆదేశించింది. అంటే భారత కరెన్సీలో అమెజాన్‌ 6,594 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...

ప్రముఖ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రైవసీ ఉల్లంఘన కింద అమెజాన్‌కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది. ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు అమెజాన్ 886 మిలియన్ డాలర్లు జరిమానా కట్టాలని యూరోపియన్ యూనియన్ ఆదేశించింది. అంటే భారత కరెన్సీలో అమెజాన్‌ 6,594 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ ప్రైవసీ రైట్స్ గ్రూప్ ‘లా క్వాడ్‌రేచర్ డూ నెట్’ యూజర్ల అనుమతి లేకుండా అమెజాన్.. యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తోందని ల్యూక్స్ంబౌర్గ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ(సీఎన్‌పీడీ)కి 2018లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన సీఎన్‌పీడీ తాజాగా తీర్పును వెలువరించింది.

యూజర్ల వ్యక్తిగత డేటా విషయంలో యూరోపియన్ యూనియన్ యొక్క ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్’ను అమెజాన్ పాటించలేదని.. వ్యక్తిగత డేటా చౌర్యానికి గురయిందని సీఎన్‌పీడీ పేర్కొంది. అయితే.. ఈ తీర్పు ప్రకారం జరిమానా చెల్లించేందుకు అమెజాన్ సిద్ధంగా లేదు. ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లనున్నట్టు ఓ ప్రకటనలో అమెజాన్ తెలిపింది. సీఎన్‌పీడీ తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని.. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లబోతున్నామని అమెజాన్ స్పష్టం చేసింది. వినియోగదారుల డేటా చౌర్యానికి అమెజాన్ పాల్పడలేదని, థర్డ్ పార్టీ ముందు కస్టమర్ల వ్యక్తిగత డేటాను ఉంచినట్లు అమెజాన్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆ సంస్థ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్’ పాటించలేదని.. వినియోగదారుల వ్యక్తిగత డేటా చౌర్యానికి గురయిందని ఈ స్థాయిలో జరిమానా విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతేడాది ప్రముఖ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’కు కూడా యాడ్ ట్రాకర్స్ రూల్స్ ఉల్లంఘించింనందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) 111.82 మిలియన్ డాలర్ల జరిమానా విధించబడింది. ఇదిలా ఉంటే.. అమెజాన్‌కు ఇంత పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించడం కూడా పెద్ద పనేం కాదు. అందుకు కారణం లేకపోలేదు. ఈ త్రైమాసికంలో భారీగా లాభాలను గడించింది. వరుసగా మూడోసారి 100 బిలియన్ డాలర్లను ఆర్జించి ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతోంది.

First published:

Tags: Amazon, E-commerce, Fine, International news

ఉత్తమ కథలు