గుండెను నైవేద్యంగా సమర్పణ... అజ్‌టెక్ తెగల చరిత్రలో ఎన్నో ఆశ్చర్యాలు

Aztec Culture : బలి ఇవ్వడమనేది అజ్‌టెక్ తెగల పూజా విధానంలో కీలక ఘట్టం. బతికివున్న మనిషి తన రొమ్ముని కోసుకొని గుండెను బయటకు తీసి... అది కొట్టుకుంటూ ఉండగానే బలి ఇచ్చి ప్రాణాలర్పించేవారు.

Krishna Kumar N | news18-telugu
Updated: October 6, 2019, 9:57 AM IST
గుండెను నైవేద్యంగా సమర్పణ... అజ్‌టెక్ తెగల చరిత్రలో ఎన్నో ఆశ్చర్యాలు
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: October 6, 2019, 9:57 AM IST
దక్షిణ అమెరికాలోని అజ్‌టెక్ సామ్రాజ్య నాగరికత ఓ అంతుచిక్కని రహస్యాల పరంపర. పరిశోధనలు జరుపుతున్న కొద్దీ ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రీస్తుకు పూర్వమే అజ్‌టెక్‌లు ఎన్నో గొప్ప పనులు చేశారు. అంతరిక్షాన్ని శోధించారు. కాలాన్ని గణించారు. భవిష్యత్తును అంచనావేశారు. మనకు అర్థంకాని ఎన్నో వింత ఆకారాలతో కట్టడాలు, శిల్పాలూ చెక్కారు. ఇలాంటి అజ్‌టెక్‌లు... తమను తాము బలి ఇచ్చుకునేందుకు కొన్ని పద్ధతులు పాటించారు. బలి ఇచ్చుకోవడమనేది ఓ పవిత్ర కార్యంగా వారు భావించారు. దేవుడే తమకు రక్త మాంసాలు పంచి ఇచ్చాడనీ, తిరిగి వాటిని దేవుడికి త్యాగం చెయ్యడం ద్వారా... కొంతైనా రుణం తీర్చుకున్నట్లవుతుందని వారు బలంగా నమ్మారు. రక్తాన్ని ధారపోస్తే దేవుళ్లు సంతోషిస్తారని విశ్వసించేవాళ్లు.

జంతువుల్ని ఎలాగైతే బలి ఇచ్చేవారో... మనుషుల్ని కూడా బలి ఇచ్చేవారు అప్పట్లో. ఇది ఎంత దారుణంగా ఉండేదంటే... బతికివున్న మనిషి తన రొమ్ముని కోసుకొని గుండెను బయటకు తీసి... అది కొట్టుకుంటూ ఉండగానే బలి ఇచ్చి ప్రాణాలర్పించేవారు. చిన్న సూది గుచ్చుకుంటేనే నొప్పిని తట్టుకోలేం. అలాంటిది... గుండెనే బయటకు తీసుకోవడమంటే మాటలకందని అంశం.


అప్పట్లో అజ్‌టెక్‌ తెగలతోపాటూ... మయన్లు కూడా ఈ పద్ధతులు పాటించారు. చాలా నాగరికతల్లో కొన్ని వందల ఏళ్లపాటూ నర బలి పాటించేవారు. ఐతే అజ్‌టెక్ సామ్రాజ్యం చేయించినన్ని నరబలులు ఇంకెవరూ చేయించలేదన్నది చరిత్రకారుల అంచనా. ఏడాదికి 10 వేల మంది దాకా చనిపోయేవారని పరిశోధనల్లో తేలింది.

aztec, aztec empire, culture, aztec civilization, aztec sacrifice, aztec documentary, aztec facts, aztec war, aztec history, aztec triple alliance, aztec warriors, aztec mythology, native culture, aztec tribe, mexica culture, history, aztec secret, mexican culture, history of the aztecs, aztec sacrifices, మయన్లు, అజ్‌టెక్ తెగలు, చరిత్ర, నరబలి, నరబలులు
ప్రతీకాత్మక చిత్రం
అజ్‌టెక్‌లకు 18 నెలలు పూర్తైతే... ఓ రౌండ్ కంప్లీట్ అయినట్లు. అంటే ఓ సంవత్సరం పూర్తైనట్లు. అలా అయినప్పుడల్లా వాళ్లు పెద్ద ఎత్తున పండగ చేసుకునేవాళ్లు. ఆ పండగలో పెద్ద ఎత్తున నరబలులు ఇచ్చుకునేవాళ్లు. బలి ఇచ్చుకునేవాళ్లు ఒళ్లంతా పెయింట్ వేసుకునేవాళ్లు. వాళ్లను పిరమిడ్ పైన నర బలి ఘట్టం దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు. బతికి వున్న వ్యక్తి గుండెను మరో వ్యక్తి కోసి... అది కొట్టుకుంటూ ఉంటే... సూర్యుడికి చూపిస్తూ... బలి ఇచ్చేవారు. ఆ తర్వాత శవాన్ని పిరమిడ్ పై నుంచీ కిందకు పడేసేవాళ్లు. పిరమిడ్ మెట్లపై నుంచీ అది దొర్లుతూ కిందకు పడిపోయేది.


ఆ శవాన్ని రకరకాలుగా వాడేవాళ్లు. జంతువులకు ఆహారంగా వేసేవాళ్లు. తలలు కోసి ప్రదర్శనకు పెట్టేవాళ్లు. మనుషుల మాంసాన్ని తినేవారని కొందరు చరిత్ర కారులు చెబుతున్నా... అందుకు సంబంధించి ఆధారాలేవీ దొరకలేదు. త్యాగాల్లో మరెన్నో రకాలున్నాయి. కొందర్ని బాణాలతో గుచ్చి చంపేవారు. కొందర్ని నీటిలో ముంచేవారు. కొందర్ని తగలబెట్టేవారు. ఇంకొందరిని నరికి చంపేవారు. ఫైటింగ్‌లో చంపేసే సంస్కృతులూ ఉన్నాయి.

 
Loading...

ఇవి కూడా చదవండి :


300 కోట్ల ఏళ్ల నాటి గోళాలు... గ్రహాంతర వాసులు తయారుచేశారా... మిస్టరీగా మిగిలిన ప్రశ్న

ఏటీఎం పిన్‌ మర్చిపోయారా... రీసెట్ చేసుకోవచ్చు... ఇలా చెయ్యండి...

తల లేకుండా 18 నెలలు బతికిన కోడి... ఎలా సాధ్యమైందంటే...

గుడ్లగూబ ఫొటోను రోజూ చూస్తే... మీకు కలిగే ప్రయోజనాలు ఇవీ...
First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...