Biggest Rocket: 120 మీటర్ల బాహుబలి రాకెట్.. స్పేస్ ఎక్స్ రికార్డ్.. దీని విశేషాలంటే తెలుసా?

స్పేస్ ఎక్స్ రాకెట్ (Image:Space-x)

Space x rocket: .స్పేస్‌ ఎక్స్‌కు చెందిన రాకెట్‌లో రెండు సెగ్మంట్స్‌ ఉంటాయి. అప్పర్‌ స్టేజ్‌లో ఉన్నదానిని స్టార్‌ షిప్‌ అని పిలుస్తారు. దీంతోపాటు సూపర్‌ హెవీ అనే బూస్టర్‌ కూడా ఉంటుంది

  • Share this:
అమెరికన్‌ స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ... టెక్సాస్‌లో ఓ భారీ రాకెట్‌ను సిద్ధం చేస్తోంది.  ఇప్పటి వరకు ఇంత పెద్ద రాకెట్ ఎవరూ తయారు చేయలేదు.  ప్రస్తుతం అంతర్జాతీయంగా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటా రాకెట్‌, అందులోని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.స్పేస్‌ ఎక్స్‌కు చెందిన రాకెట్‌లో రెండు సెగ్మంట్స్‌ ఉంటాయి. అప్పర్‌ స్టేజ్‌లో ఉన్నదానిని స్టార్‌ షిప్‌ అని పిలుస్తారు. దీంతోపాటు సూపర్‌ హెవీ అనే బూస్టర్‌ కూడా ఉంటుంది. ఈ రెండింటినీ టెక్సాస్‌లోని బొకాచికాలోని స్టార్‌ బేస్‌ ఆర్‌ & డీలో కలిపి భారీ రాకెట్‌ను సిద్ధం చేశారు. ఈ స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ 120 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి ప్రయోగించిన రాకెట్లలో ఇదే పొడవైనది అని సమాచారం. కొత్త స్పేస్‌ ఎక్స్‌ సూపర్‌ హెవీ బూస్టర్‌... 70 మెగాన్యూటన్లను సాధిస్తుందని అంచనా. రాకెట్‌లోని రెండు సెగ్మంట్లను కలపడానికి ఓ భారీ క్రేన్‌ను ఉపయోగించారు. మరికొన్ని నెలల్లో పయనం కానున్న ఈ స్పేస్‌ఎక్స్‌ స్టార్‌ షిప్‌కు కొన్ని వారాల పాటు ప్రయోగాలు చేస్తారు.

స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఈ భారీ రాకెట్‌తో భూమి చుట్టూ ఓ ట్రిప్‌ వేయనున్నారు. టెక్సాస్‌ నుండి బయలుదేరే ఈ రాకెట్‌... పసిఫిక్‌లోని హవాయిన్‌ ద్వీపంలోని జలాల్లో లాండ్‌ అవుతుంది. సూపర్ హెవీ అయితే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ల్యాండ్‌ అవుతుంది. ఈ రెండూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా... పూర్తి కంట్రోల్‌తో ల్యాండ్‌ అవ్వాలని స్పేస్‌ ఎక్స్‌ కోరుకుంటోంది. దాని వల్ల మరోసారి వాటిని వాడుకోవచ్చనేది స్పేస్‌ ఎక్స్‌ ఆలోచన. ఈ స్టారషిప్ సిస్టమ్‌ను పూర్తిగా సిద్ధం చేసి... చంద్రుడు, అంగారకుడుపైకి మనుషుల్ని పంపించాలని స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ భావిస్తున్నారు. అలా మనుషుల్ని భూమి చుట్టూ ఓ ట్రిప్‌ వేయించడం, శాటిలైట్లను ఓ కక్ష్యలో ఉంచడం లాంటివి చేయొచ్చనేది లక్ష్యం.

మరోవైపు స్పేస్‌ఎక్స్‌తో నాసా ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. స్టార్‌ షిప్‌ అప్పర్‌ స్టేజ్‌లో వ్యోమగాములను పంపించి లూనార్‌ సౌత్‌ పోల్‌కు చేరవేయాలనేది నాసా ఆలోచన. ఇక ప్రస్తుత సంగతి చూస్తే... స్టార్‌ బేస్‌కు ప్రోటోటైప్‌ సిద్ధం చేశారు. ఈ క్రమంలో సెగ్మంట్ల మేటింగ్‌ చేశారట. దాని వల్ల ఒరిజినల్‌ ఎలా ఉండాలి అనే విషయంలో ఉపయోగం ఉంటుంది. మరోవైపు ఈ స్టార్‌షిప్‌ లాంచ్‌ కోసం ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) నుండి అనుమతి తీసుకునే పనులూ సాగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం దీనికై పర్యావరణ సమీక్ష నిర్వహిస్తోంది. అయితే ఈ ఏడాది ఆఖరిలోపు ఈ ప్రయోగం పూర్తయ్యేలాఎలోన్​ మస్క్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Video: వాట్టే డాన్స్.. అదుర్స్ అంతే.. వీడేరా సూపర్ డాన్స్ పోలీస్‌!

Video: వామ్మో దెయ్యం!.. సెక్యూరిటీ గార్డును ఏం చేసిందో చూడండి
Published by:Shiva Kumar Addula
First published: