Climate Change: మెయిల్స్ పంపితే వాతావరణం కాలుష్యమవుతుందా..?

Climate Change: మెయిల్స్ పంపితే వాతావరణం కాలుష్యమవుతుందా..?

ప్రతీకాత్మక చిత్రం

వాతావరణ కాలుష్యానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. కర్బన ఉద్గారాలు అధికంగా విడుదల చేయడం, అనియంత్రిత కర్మాగారాలు, బొగ్గును అధికంగా మండించడం తదితర కారణాల వల్ల గాల్లో కాలుష్యం శాతం నానాటికి పెరిగిపోతోంది.

  • Share this:
వాతావరణ కాలుష్యానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. కర్బన ఉద్గారాలు అధికంగా విడుదల చేయడం, అనియంత్రిత కర్మాగారాలు, బొగ్గును అధికంగా మండించడం తదితర కారణాల వల్ల గాల్లో కాలుష్యం శాతం నానాటికి పెరిగిపోతోంది. అయితే ఈమెయిల్స్ ద్వారా కూడా వాతావరణం కాలుష్యమవుతుందా అంటే అవుననే చెబుతున్నారు బ్రిటీష్ అధికారులు. క్లైమేట్ చేంజ్ ను క్రమబద్ధీకరించేందుకు నిమగ్నమైన వీరు ఓ సరికొత్త ప్రమాదాన్ని గుర్తించారు. ఎలాంటి సారాంశం లేని అసహజ ఈమెయిల్స్ పంపించడం ద్వారా కార్బన్ ఫుట్ ప్రింట్లు విడుదలవుతున్నట్లు గమనించారు. 'థ్యాంక్స్' చెబుతూ చేసే ఈమెయిల్స్ రోజూ పెరిగిపోతున్నాయని అన్నారు.

ఒక్కరోజు మెయిల్స్ పంపించడం ఆపేస్తే చాలు..
64 మిలియన్లకు పైగా ఈమెయిల్స్ ఇలాంటి సారాశం లేని సందేశాలను బ్రిటన్లు పంపిస్తున్నారని తెలిపారు. ఫలితంగా వందలాది టన్నుల కార్బన్ ఫుట్ ప్రింట్ విడుదలకు వినియోగదారులు కారణమవుతున్నారు. ఒక్క రోజైనా ఇలాంటి అసహజ ఈమెయిల్స్ పంపించడం ఆపేస్తే చాలా వరకు కార్బన్ ను ఆదా చేయవచ్చని కాప్26 సదస్సుకు సన్నహాలు చేస్తోన్న ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ అంశంపై పరిశోధనల దిశగా ముందడుగు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నవంబరులో కాప్ 26 శిఖరాగ్ర సదస్సు యూకేలోని గ్లాస్గోలో నిర్వహించనున్నారు.

వాతావరణ కాలుష్యానికి ఈమెయిల్స్ కారణవుతున్నాయని మొదటగా లండన్ కు చెందిన నేషనల్ సైబర్ సెక్యురిటీ సంస్థ ముందుకు తీసుకొచ్చింది. ఆన్ లైన్ లైఫ్ భద్రతా అనే అంశంపై ఈ కంపెనీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే ఈ ఆరోపణల ఆ సంస్థ ఖండించింది.

వీడియో కాలింగ్, స్ట్రీమింగ్ నుంచి ఉద్గారాలు..
గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే విద్యుత్ శక్తి నుంచి కార్బన్ ఫుట్ ప్రింట్లు వస్తున్నాయి. నెట్వర్క్ కేంద్రాల నుంచి వచ్చే సమాచారం వీటి నుంచి బదిలీ అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో కార్బన్ ఫుట్ ప్రింట్లు 0.1 శాతం ఈమెయిల్స్ నుంచి విడుదలవుతుంది. 20 శాతం వరకు ఆటోమొబైల్స్ నుంచి కర్బన ఉద్గారాలు విడుదలవుతుండటం ఇందుకు విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా ఆన్ లైన్ మీడియా నుంచి వచ్చే వీడియో కాల్స్, వీడియో గేమ్స్ స్ట్రీమింగ్ లాంటి వల్ల కర్బన ఫుట్ ప్రింట్లు నుంచి వస్తున్నాయి.

12 నెలల్లో 16 టన్నుల కార్బన్ ఫుట్ ప్రింట్లు..
యూకేలోని ప్రతి వ్యక్తి రోజులో తక్కువ ఈమెయిల్స్ పంపినట్లయితే.. 12 నెలల్లో 16వేల టన్నుల కంటే ఎక్కువ కర్బన ఉద్గారాల ఉత్పత్తిని తగ్గించవచ్చని ఓవో ఎనర్జీ నియమించిన అధికారులు సలహా ఇచ్చారు. లండన్ నుంచి మాడ్రిడ్ కు విమాన ప్రయాణాలు చేస్తున్న 80 వేల మంది వ్యక్తులకు ఈ సంఖ్య సమానమవుతుందని విశ్లేషణ పేర్కొంది. ఈ అనవసరమైన మెయిల్స్ అయిన 'థ్యాంక్యూ', 'అభినందనలు', 'చీర్స్', 'ఎల్ఓఎల్' లాంటి సందేశాలు ఉన్నాయి.

పునరుత్పాధక శక్తిపై పెట్టుబడులు పెట్టాలి..
డేటా ట్రాఫిక్ ను గుర్తించడం చాలా ముఖ్యమని, ఇందులో ఎనర్జీ, కార్బన్ ఫెనాల్టీని కలిగి ఉండే ఈమెయిల్స్ ఉన్నాయని వాతావరణం, పరిసరాలు అనుబంధ డైరెక్టర్ సుసాన్ బార్కర్ పేర్కొన్నారు. ఏదేమైనా శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాధక శక్తిని ఉపయోగించడం కోసం విజ్ఞాన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆమె నొక్కి చెప్పారు. అంతేకాకుండా 2030 నాటికి కర్బన ఉద్గారాలను 50 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సూచించారు.

లాంకాస్టర్ వర్సిటీలోని అద్యాపకులు మైక్ బెర్నర్లీ ఈమెయిళ్లను కట్ చేసే అభిప్రాయాన్ని అంచనా వేయడాన్ని విశ్లేషించారు. ప్రతి ఈమెయిల్ బ్యాక్ ఆఫ్ ఎన్వలప్ లెక్కలపై ఆధారపడి ఉందని, టెక్ రంగానికి సంబంధించి విడుదలయ్యే ఉద్గారాల్లో ఇదో చిన్న భాగమని అన్నారు. వాతావరణ మార్పులపై విస్తృత సంభాషణలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే తక్కువ కార్బన్ విడుదల వల్ల ప్రపంచానికి ఈ రంగం దోహదపడుతుందా లేదా అనే దానిపై అదనపు ముఖ్యమైన ఐటి ప్రశ్నలకు ప్రాధాన్యతనివ్వడం ముఖ్యమని ఆయన అన్నారు.

ఏదేమైనా, ఆర్థిక మందగమనం వివిధ రంగాల నుంచి కార్బన్ ఉద్గారాలను పరిమితం చేసిన సమయంలో కోవిడ్ -19 విపత్తులో ఐటి తన ప్రయోజనాలను నిరూపించింది. "మా కార్బన్ ఫుట్ ప్రింట్ ను పెంచకుండా, జీవించగలమని మేము నమ్ముతున్న దానికంటే మెరుగ్గా జీవించడానికి ఐటి మాకు దోహదపడిందని చూడటం చాలా గొప్ప నమ్మకం" అని ఆయన చెప్పారు.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు