ట్రంప్.. నువ్వు తోపు: తనను తానే అభినందించుకున్న డొనాల్డ్

‘ధాంక్యూ ప్రెసిడెంట్ టీ’ అని అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేశారు. అలాగే, దేశంలో వడ్డీ రేట్ల తగ్గుదల కోసం చర్యలు తీసుకున్న ఫెడరల్ రిజర్వ్‌ను కూడా ఆయన అభినందించారు.

news18-telugu
Updated: November 26, 2018, 4:50 PM IST
ట్రంప్.. నువ్వు తోపు: తనను తానే అభినందించుకున్న డొనాల్డ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫోటో: Reuters)
  • Share this:
‘ట్రంపూ.. నువ్వు భేష్.’ ఇది ఎవరో అన్న మాట కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు తానే భుజం తట్టుకున్నారు. ఇటీవల అమెరికాలో పెట్రోల్ ధరలకు భారీగా తగ్గాయి. సౌదీ అరేబియాతో పాటు ఇతర క్రూడాయిల్ ఉత్పత్తి చేసే దేశాలపై ఆంక్షలు విధించి, పరోక్షంగా బెదిరించి మొత్తానికి వారిని దారికి తెచ్చారు ట్రంప్. కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియా క్రూడాయిల్ ధరలను తగ్గించింది. ఆ ప్రభావంతో అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయినా, ఆ క్రెడిట్‌ను ఎవరూ గుర్తించడం లేదని భావించారో లేకపోతే, మొదట తనకు తానే గుర్తించానని ప్రపంచానికి చెప్పాలనుకున్నారో కానీ, అమెరికా అధ్యక్షుడు తన భుజం తానే తట్టి శెభాష్ అని చెప్పుకొన్నారు. ‘ధాంక్యూ ప్రెసిడెంట్ టీ’ అని అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేశారు. అలాగే, దేశంలో వడ్డీ రేట్ల తగ్గుదల కోసం చర్యలు తీసుకున్న ఫెడరల్ రిజర్వ్‌ను కూడా ఆయన అభినందించారు.



ఓ వైపు తనకు తాను అభినందించుకున్న ట్రంప్.. మరోవైపు మధ్య అమెరికా దేశాల మీద మండిపడ్డారు. కొందరిని తీసుకొచ్చి అమెరికాలో పడేస్తున్నారంటూ మెక్సికో మీద విరుచుకుపడ్డారు. కొందరు వారి దేశంలోని ఓ వర్గం వారిని తీసుకొచ్చి అమెరికా బోర్డర్‌లో పడేస్తున్నారని విమర్శించారు. ఇకపై ఇలాంటివన్నీ జరగనివ్వబోమని హెచ్చరించారు. అలాగే, దేశంలో చొరబాట్లకు కారణం డెమోక్రాట్స్ అని ట్రంప్ మండిపడ్డారు. ఇటీవల హాలిడే టూర్ కోసం ఫ్లోరిడా వెళ్లిన ట్రంప్.. తన పర్యటనను ముగించారు. అక్కడ తన ఫేవరెట్ గోల్ఫ్ క్లబ్‌ను సందర్శించారు.

ఫర్హాన్ అక్తర్ గర్ల్‌ఫ్రెండ్ హాట్ ఫొటోస్..
Published by: Ashok Kumar Bonepalli
First published: November 26, 2018, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading