HOME »NEWS »INTERNATIONAL »thailand woman sent to jail for years for sharing online posts criticizing the royal family krs

థాయ్​ మహిళకు 43ఏళ్ల జైలుశిక్ష.. సోషల్ మీడియా పోస్టుల వల్లే

థాయ్​ మహిళకు 43ఏళ్ల జైలుశిక్ష.. సోషల్ మీడియా పోస్టుల వల్లే
ప్రతీకాత్మక చిత్రం

నిబంధనలను ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా(Social Media)లో పోస్టులు పెట్టినందుకు 65 ఏళ్ల మహిళకు థాయ్​లాండ్​ (Thailand) లోని ఓ కోర్టు ఏకంగా 43 సంవత్సరాల శిక్ష వేసింది.

  • Share this:
    థాయ్​లాండ్​కు చెందిన ఓ 65 ఏళ్ల మహిళకు ఆ దేశంలోని ఓ కోర్టు ఏకంగా 43 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రాచరికాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడమే ఆమె నేరం. రాజ కుటుంబాన్ని అవమానించిందుకు థాయ్​ చరిత్రలో విధించిన అతి పెద్ద శిక్ష ఇదేనని ఆమె తరఫున వాదించిన లాయర్ చెప్పారు.

    2014లో రాచరికానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేసిన సమయంలో నిరసనలో పాల్గొన్న కొందరు నాయకులు ప్రసంగించారు. ఆ సమయంలో అన్​చన్ ప్రీలెర్ట్​ అనే ఆమె సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేశారు. రాచరికాన్ని అవమాన పరిచే ఒక్కో చర్యకు 15ఏళ్ల జైలు శిక్ష విధించేలా థాయ్​లో ‘లేసే మెజిస్టే’ అనే కఠిన చట్టం ఉంది.



    అయితే 2014, 2015 మధ్య ఆ ప్రసంగాల వీడియోలను ఫేస్​బుక్​, యూట్యూబ్​లో పోస్ట్ చేసి ఆమె 29సార్లు ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆమె లాయర్ వెల్లడించారు.  థమికంగా ఆమెకు 87 ఏళ్ల జైలు విధించగా.. ఆ తర్వాత ఉల్లంఘనలు చేసినట్టు అంగీకరించడంతో కోర్టు శిక్షను తగ్గించింది.

    “లీసే మెజెస్టే కేసులో ఇప్పటి వరకు ఇదే అత్యధిక జైలు శిక్ష. అయితే ఆమె ఇంకా రెండు ఉన్నత కోర్టుల్లో ఈ తీర్పును సవాలు చేయవచ్చు” అని మానవ హక్కుల గ్రూప్ లాయర్​ చెప్పారు.

    2015లో జనవరిలో అన్​చన్ ఇంట్లో సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేశారు. తొలుత ఆమె కేసు విచారణ మిలటరీ కోర్టులో జరిగింది. 2019 ఎన్నికల తర్వాత సివిలియన్ కోర్టుకు మార్చారు.

    2014 ఘటన తర్వాత మొత్తం 169 మందిపై లీసే మెజెస్టె కేసులు నమోదవగా.. విచారణకు సంవత్సరాల సమయం పడుతోందని మానవ హక్కుల లాయర్ల బృందం చెబుతోంది.

    2018లో ప్రభుత్వం కొంతకాలం లీసే మెజెస్టె చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే 2019లో పోలీసులు మళ్లీ ఈ చట్టాన్ని తెచ్చారు. దీంతో రాచరికానికి వ్యతిరేకంగా వేలాది మంది  రోడ్లపై నిరసనలు చేసి, బహిరంగంగా విమర్శించారు. దీంతో దాదాపు 40వేల మందిపై ఆ కేసు పెట్టారు. అయితే ఒక్కరిపై కూడా కోర్టుల్లో పూర్తిస్థాయి విచారణ జరగలేదు.
    Published by:Krishna P
    First published:January 20, 2021, 12:07 IST