పార్లమెంట్‌లో పోర్న్ చూస్తూ అడ్డంగా దొరికిపోయిన ఎంపీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రజా సమస్యలు చర్చిందేందకు పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఎంపీ.. సభ్య సమాజం తలదించుకునే పనిచేశాడు. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన వ్యక్తి.. సోయి మరిచి ప్రవర్తించాడు.

  • Share this:
    ప్రజా సమస్యలు చర్చిందేందకు పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఎంపీ.. సభ్య సమాజం తలదించుకునే పనిచేశాడు. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన వ్యక్తి.. సోయి మరిచి ప్రవర్తించాడు. తాను పార్లమెంట్‌లో ఉన్నాననే సంగతి మరిచి నగ్న చిత్రాలు వీక్షించాడు. ఈ ఘటన థాయ్‌లాండ్ పార్లమెంట్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. థాయ్‌లాండ్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగంపై శ్రద్ధ పెట్టాల్సిన సమయంలో చోన్బూరి ప్రావిన్స్ ఎంపీ రోన్నాథెప్ అనువత్ ఫోన్‌పై దృష్టి పెట్టాడు. అందులో పోర్న్ వీక్షించాడు.

    ఇది కాస్త గ్యాలరీలో నుంచి పార్లమెంట్ సమావేశాలు వీక్షిస్తున్న రిపోర్టర్ల కంట పడింది. దీంతో వారు ఈ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. ఆయన దాదాపు 10 నిమిషాల పాటు ఫోన్‌లో ఆ చిత్రాలు చూస్తూ కనిపించారు. ఒకానొక సందర్భంలో ఆయన కరోనా నిబంధలను కూడా మరిచి మాస్క్ తీసి.. ఫోర్న్ చిత్రాలను చూడటం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితే తాను నగ్న చిత్రాలు చూసినట్టు ఒప్పుకున్న ఆ ఎంపీ అందుకు విచిత్రమైన సాకు చెప్పాడు. లైన్ యాప్‌లో మహిళ సాయం కావాలని అడుగుతున్న దృశ్యాలు తన ఫోన్‌కు వచ్చాయని, ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉందో తెలుసుకోని, హెల్ఫ్ చేయడానికే ఫోన్ వాడానని తెలిపాడు.
    Published by:Sumanth Kanukula
    First published: