థాయ్ రాజు సంచలన నిర్ణయం : ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?

70ఏళ్ల పాటు థాయ్ సింహాసనాన్ని అధిష్టించి అక్టోబర్ 2016లో వజిరాలోంగ్‌కోర్న్ తండ్రి కింగ్ భూమిబొల్ మరణించారు. ఆయన మరణం తర్వాత ఖాళీ అయిన సింహాసనాన్ని ఇప్పుడు ఆయన కుమారుడు వజిరాలోంగ్‌కోర్న్ అధిష్టించబోతున్నారు.

news18-telugu
Updated: May 2, 2019, 5:17 PM IST
థాయ్ రాజు సంచలన నిర్ణయం : ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?
థాయ్‌లాండ్ కింగ్ వజిరాలోంగ్‌కోర్న్, ఆయన సతీమణి సుతిథ
  • Share this:
థాయ్‌లాండ్ రాజుగా పట్టాభిషేకానికి కొద్దిరోజుల ముందు.. కింగ్ మహా వజిరాలోంగ్‌కోర్న్(66) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పర్యవేక్షించే డిప్యూటీ హెడ్‌‌ను వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం ఆమెకు క్వీన్ సుతిథ అని నామకరణం చేశారు. రాజు వివాహ విషయాన్ని అధికారికంగా రాయల్ గెజిట్‌లో ప్రచురించారు. అలాగే వివాహానికి సంబంధించిన వీడియో ఫుటేజీ కూడా రాయల్ న్యూస్‌ చానెల్‌లో ప్రసారం చేశారు.

70ఏళ్ల పాటు థాయ్ సింహాసనాన్ని అధిష్టించి అక్టోబర్ 2016లో వజిరాలోంగ్‌కోర్న్ తండ్రి కింగ్ భూమిబొల్ మరణించారు. ఆయన మరణం తర్వాత ఖాళీ అయిన సింహాసనాన్ని ఇప్పుడు ఆయన కుమారుడు వజిరాలోంగ్‌కోర్న్ అధిష్టించబోతున్నారు. శనివారం (మే 4న) బుద్దిస్ట్, బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారం ఆయన పట్టాభిషేకం జరగనుంది. అనంతరం బ్యాంకాక్ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.వజిరాలోంగ్‌కోర్న్‌కి 10వ రామా అన్న బిరుదు కూడా ఉంది.

తాజాగా కింగ్ వజిరాలోంగ్‌కోర్న్ వివాహామాడిన సుథిద 2014లో విమాన అటెండెంట్‌గా థాయ్ ఎయిర్‌వేస్‌లో కొన్ని రోజులు పనిచేసింది. ఆ తర్వాత రాజు వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో డిప్యూటీ కమాండర్ హోదాలో పనిచేసింది. నిజానికి రాజుకు, సుతిథకి మధ్య చాలా కాలంగా రహస్య సంబంధం ఉందని.. కానీ కింగ్ ప్యాలెస్ వర్గాలు ఏనాడు ఈ విషయాన్ని వెల్లడించలేదన్న వాదన వినిపిస్తోంది.

First published: May 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>