21 మందిని బలితీసుకున్న థాయ్‌లాండ్ షూటర్‌ హతం...

Thailand Shooting: థాయ్‌లాండ్ ఆర్మీ జవాను ఘాతుకానికి పాల్పడ్డాడు. అమాయక పౌరులపై ఆటోమెటిక్ మిషన్ గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా...పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

news18-telugu
Updated: February 9, 2020, 8:55 AM IST
21 మందిని బలితీసుకున్న థాయ్‌లాండ్ షూటర్‌ హతం...
థాయ్‌లాండ్ షూటర్ హతం
  • Share this:
థాయ్‌లాండ్‌లో 21 మంది అమాయక పౌరులను విచక్షణారహితంగా కాల్చిచంపిన ఉన్మాదిని పోలీసులు హతమార్చారు. ఖోరత్ నగరంలో ఆ దేశ సైనికుడు ఆదివారం బీభత్సం సృష్టించాడు.  అమాయక పౌరులపై ఆటోమెటిక్ మిషన్ గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా...పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనంపై ఓ షాపింగ్ మాల్ దగ్గర తిరుగుతూ బీభత్సం సృష్టించాడు. దీన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. చివరకు షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించి కొందరిని బంధీలుగా పట్టుకున్నాడు. షాపింగ్ మాల్‌ను తమ దిగ్భందంలోకి తీసుకున్న పోలీసులు...కొన్ని గంటల పోరాటం తర్వాత ఉన్మాదిని హతమార్చారు.

గన్‌మన్‌ను 32 ఏళ్ల జక్రపంత్ తొమ్మాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలి వద్ద గన్‌మన్ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా మృతి చెందగా..మరో ఇద్దరు గాయపడినట్లు ఆ దేశ ప్రజా ఆరోగ్య శాఖ మంత్రి అనుతిన్ చరన్‌విరాకుల్ తెలిపారు. కాల్పుల ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా పడటంతో...మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
First published: February 9, 2020, 8:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading