హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Texas deep freeze: గడ్డకట్టి చనిపోతున్న వన్యప్రాణులు.. అమెరికాలో మంచు మృత్యువు

Texas deep freeze: గడ్డకట్టి చనిపోతున్న వన్యప్రాణులు.. అమెరికాలో మంచు మృత్యువు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శాన్ ఆంటోనియో ప్రైమరీ ప్రిమెట్స్ అభయారణ్యంలో ఉన్న జంతువులు చలికి గడ్డకట్టుకుపోయి చనిపోతున్నాయి. హీటర్లు వాడేందుకు కరెంటు లేకపోవడంతో మైనస్ డిగ్రీల చలికి ఒక చింపాంజీ, అనేక కోతులు, కొన్ని లెమూర్లు, లెక్కలేనన్ని పక్షులు చనిపోయాయి.

అమెరికాలోని టెక్సాస్‌లో మంచు తుఫానుల బీభత్సం కొనసాగుతోంది. శీతల గాలులు, మంచు ప్రభావంతో అక్కడి వణ్యప్రాణులు చనిపోతున్నాయి. సంరక్షణ కేంద్రాల్లో ఎన్ని ఏర్పాట్లు చేసినా చల్లని ఉష్ణోగ్రతలకు అవి తట్టుకోలేకపోతున్నాయి. శీతాకాలం ప్రారంభమైన కొత్తలో రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో శాన్ ఆంటోనియో ప్రైమరీ ప్రిమెట్స్ అభయారణ్యంలో ఉన్న జంతువులు చలికి గడ్డకట్టుకుపోయి చనిపోతున్నాయి. హీటర్లు వాడేందుకు కరెంటు లేకపోవడంతో మైనస్ డిగ్రీల చలికి ఒక చింపాంజీ, అనేక కోతులు, కొన్ని లెమూర్లు, లెక్కలేనన్ని పక్షులు చనిపోయాయి. ఈ సంరక్షణ కేంద్రం మార్చురీలా మారిందని అభయారణ్యం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రూక్ చావెజ్ తెలిపారు. మంచు తుఫాను, శీతల వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉండటంతో ఇక్కడి జంతువులు, పక్షుల ప్రాణాలు మరింత ప్రమాదంలో పడ్డాయి.

సోమవారం తెల్లవారుజామున అభయారణ్యానికి విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. వెంటనే సంరక్షణ కేంద్రంలో ఉన్న 400 జంతువులను వెచ్చగా ఉంచడానికి జనరేటర్లు, స్పేస్ హీటర్లు, ప్రొపేన్ ట్యాంకులు, దుప్పట్లను సిద్ధం చేశారు. కానీ ఉష్ణోగ్రతలు మరింత తక్కువకు పడిపోతుండడంతో జంతువులను ఈ కేంద్రం నుంచి సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో బృదం చనిపోయిన జంతువులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మొత్తం ఎన్నిజంతువులు చనిపోయాయో ఇంకా తెలియదని చావెజ్ చెప్పారు.

ఇతర ప్రాంతాలకు తరలింపు

ఏయే జంతువులను పట్టుకోగలమో అంచనా వేసి, వాటిల్లో వేటిని ముందు కాపాడాలో నిర్ణయించుకోవడం సవాలుగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. కొన్ని జంతువులను ఓక్లహోమా సరిహద్దులో ఉన్న శాన్ ఆంటోనియో జంతు ప్రదర్శనశాలకు, మరో అభయారణ్యం వద్దకు తీసుకెళ్లారు. మరికొన్నింటిని సంరక్షించేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. ఇక్కడి 33 చింపాంజీలు మాత్రం అభయారణ్యంలో మిగిలిపోయాయి. వీటిని పట్టుకోవడం, ఇతర ప్రాంతాలకు తరలించడం కష్టమైన నేపథ్యంలో చింపాంజీలను అక్కడే ఉంచారు. వీటి సంరక్షణ కోసం ప్రైమరీ ప్రిమేట్స్ తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో విరాళాలు సేకరిస్తోంది.

మారని వాతావరణం

టెక్సాస్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. అతి శీతల వాతావరణం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో చాలా వరకు పవర్ గ్రిడ్‌లను నిర్వహించడం కష్టమవుతోంది. దీంతో కరెంటు కోతలు అనివార్యమయ్యాయి. మరికొన్ని రోజులు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఉంటాయని అధికారులు తెలిపారు. మంచు తుఫాను వల్ల చలి తీవ్రత ఎక్కువ అవుతోంది. గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రతల వల్ల ఇళ్లు, భవనాలను హీటర్ల సాయంతో వేడిగా ఉంచలేకపోతున్నారు. దీనికి తోడు కరెంటు కోతలు కూడా ఉండటంతో చాలా ప్రాణులు చనిపోతున్నాయి.

పెరుగుతున్న కాలుష్యం

చాలామంది ప్రజలు వెచ్చదనం కోసం స్టవ్‌లు, జనరేటర్లు వాడుతున్నారు. కొంతమంది ఏకంగా కార్లలో ఉంటున్నారు. ఫలితంగా కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు ఎక్కువగా విడుదల అవుతూ వాతావరణం కాలుష్యమవుతోంది. చలి ప్రభావానికి తట్టుకోలేక చనిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విద్యుత్ కోతల వల్ల బుధవారం కూడా టెక్సాస్‌లోని 30 లక్షలమంది ప్రజలు అంధకారంలో ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

First published:

Tags: America, Snow fall, Us news

ఉత్తమ కథలు