Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Elon Musk: పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలాన్‌ మస్క్‌.. పొగడ్తలతో ముంచెత్తిన టైమ్ మ్యాగజైన్!

Elon Musk: పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలాన్‌ మస్క్‌.. పొగడ్తలతో ముంచెత్తిన టైమ్ మ్యాగజైన్!

ఎలాన్ మస్క్ (ఫైల్ ఫొటో)

ఎలాన్ మస్క్ (ఫైల్ ఫొటో)

Elon Musk: టెస్లా మోటార్స్‌ సీఈవో, స్పేస్ ఎంట్రప్రెన్యూర్ ఎలాన్‌ మస్క్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ది టైమ్ కూడా అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ "పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021" గా ప్రకటించింది.

టెస్లా (Tesla) మోటార్స్‌ సీఈవో, స్పేస్ ఎంట్రప్రెన్యూర్ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రపంచాన్ని మార్చగల శక్తి, దూరదృష్టి ఒక్క ఎలాన్‌ మస్క్‌కే ఉందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ది టైమ్ (The Time) కూడా అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతూ "పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021" (Person of the Year) గా ప్రకటించింది. 2021 ఏడాదికి గాను టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలాన్‌ మస్క్‌ను ప్రకటిస్తూ.. అతను చేస్తున్న సాంకేతిక మార్పులు, ప్రజల జీవితాలను మార్చే పోకడలను కూడా మ్యాగజైన్ పేర్కొంది. మస్క్ ఈ ఏడాది అమెజాన్ (Amazon) ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను (Jeff Bezos) వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనిక వ్యక్తిగా నిలిచారు. టెస్లా ఎలక్ట్రిక్ కారు కంపెనీతో భూమిపై.. స్పేస్‌ఎక్స్ రాకెట్‌లతో అంతరిక్షంలో మస్క్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆ విధంగా ఆయన ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంటున్నారు.

"అత్యంత ప్రభావశీలి వ్యక్తిగా అవతరించిన మస్క్ పెరుగుదల విస్తృత తీరుతెన్నులతో సమానంగా ఉంటుంది. టెక్నాలజీ మాగ్నెట్‌లతో సమానంగా అతను పోటీ పడుతున్నారు" అని టైమ్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంతల్ పేర్కొన్నారు. 2021లో సమాజంలోని భారీ మార్పులకు చక్కటి ఉదాహరణగా మస్క్ అవతరించారని ఎడ్వర్డ్ పేర్కొన్నారు. ఆ మార్పుల్లో సాంప్రదాయిక సంస్థల నిరంతర క్షీణత; వ్యాపారానికి మరింత అధికారాన్ని, బాధ్యతను అందించిన ప్రభుత్వ పాత్రను తగ్గించడం; సంపద, అవకాశాలను వేరు వేరు చేయడం ఉన్నాయన్నారు. ఈ ఘనత గత సంవత్సరం అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లను వరించింది. ఒక సంవత్సరంలో మంచైనా, చెడైనా అత్యంత ప్రభావశీల వ్యక్తులను పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తామని టైమ్ ఎడిటర్లు ఇంతకుముందు అన్నారు.

Viral News: కూతురి 'గుర్తింపు'ను అక్రమాలకు వాడుకున్న మహిళ.. స్టూడెంట్ లోన్‌ స్వాహా, యువకులతో డేటింగ్అక్టోబర్‌లో మస్క్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ వాల్యుయేషన్ ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. మరోవైపు స్పేస్‌ఎక్స్ యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసాతో జతకట్టి భూమిని ఉల్క నుంచి రక్షించే టెస్ట్ రన్‌తో సహా వివిధ మిషన్లను ప్రారంభించింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, కరోనా సమయంలో మస్క్ సంపద 250 బిలియన్ డాలర్లకు పెరిగింది. దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్ తన టెస్లా స్టాక్‌లో 10 శాతం వాటాను విక్రయించాలా వద్దా అని ట్విట్టర్‌లో ఒక పోల్‌ నిర్వహించారు. నవంబర్‌లో పెట్టిన ఈ పోల్ కాస్త వివాదాస్పదమైంది. మస్క్ స్టాక్ మార్కెట్లను, క్రిప్టోకరెన్సీ ధరలను ఒక్క ట్వీట్ తో మార్చగలరు. కానీ ప్రస్తుతానికి అతను ఎలక్ట్రిక్ వాహనాలపై బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తారు.

gunfire against vigil: అమెరికాలోని ఓ వేడుకలో విషాదం.. జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగులుమస్క్ ఇటీవలి కాలంలో అమెరికన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో బాగా కనిపించారు. దాంతో ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 66 మిలియన్లకు చేరుకుంది. మే నెలలో కామెడీ షో సాటర్డే నైట్ లైవ్‌లో గెస్ట్-హోస్ట్ గా చేశారు. మస్క్ అంగారక గ్రహాన్ని వలసరాజ్యంగా మార్చడంలో తనకున్న ఆసక్తి గురించి మాట్లాడారు. "అమెరికన్ రిటర్న్ టు ద మూన్" అనే స్పేస్‌ఎక్స్ ప్లాన్ లో భాగంగా వచ్చే ఏడాది ఆర్బీటల్ విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. మనిషి జీవితాన్ని బహుళ-గ్రహాలుగా మార్చడం.. మానవాళిని స్పేస్‌ఫేరింగ్ నాగరికతగా మార్చడమే తన అంతిమ ధ్యేయమని మస్క్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఇంటర్వ్యూలో టైమ్‌కి తెలిపారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Elon Musk, Tesla Motors