Home /News /international /

TESLA CEO ELON MUSK CALLS BIDEN A DAMP SOCK PUPPET IN HUMAN FORM PVN

Elon Musk : ఆయనో తోలుబొమ్మ..బైడెన్ పై టెస్లా సీఈవో సంచలన వ్యాఖ్యలు

ఎలాన్ మస్క్-జో బైడెన్(ఫైల్ ఫొటో)

ఎలాన్ మస్క్-జో బైడెన్(ఫైల్ ఫొటో)

Elon Musk On Biden : అమెరికన్‌ ప్రజలను జో బైడెన్‌ ఫూల్స్‌ మాదిరిగా చూస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మస్క్. బైడెన్ మనిషి రూపంలో ఉన్న తోలు బొమ్మ అని విమర్శించారు.

Elon Musk On Joe Biden :  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్‌ ప్రజలను జో బైడెన్‌ ఫూల్స్‌ మాదిరిగా చూస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మస్క్. బైడెన్ మనిషి రూపంలో ఉన్న తోలు బొమ్మ అని విమర్శించారు. అయితే జో బైడెన్ పై ఎలాన్ మస్క్ ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలేంటో చూద్దాం.

కోవిడ్ కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రెండు రోజుల క్రితం ఓ సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు, లక్ష్యాల నిర్దేశం వంటి విషయాలపై ప్రముఖ సంస్థల సీఈఓలతో బైడెన్ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థల అధినేతలతోనూ సమావేశమయ్యారు. అయితే, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను మాత్రం ఈ సమావేశానికి పిలవలేదు. జీఎం(జనరల్ మోటార్స్), ఫోర్డ్ సంస్థల సీఈవోలతో బైడెన్ వైట్ హౌస్ లో సమావేశమయ్యారు. విద్యుత్ వాహనాల కోసం సరికొత్త చట్టం చేస్తామంటూ బైడెన్ వారికి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ALSO READ : Toyota Heading To Moon : చంద్రుడిపైకి టయోటా కారు..ఎందుకో తెలుసా

ఈ సమావేశం అనంతరం జో బైడెన్ ఓ ట్వీట్ చేశారు.. భవిష్యత్తు ఇక్కడే అమెరికాలోనే తయారవుతుందని చెబుతున్నా. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎం (జనరల్‌ మోటార్స్‌), ఫోర్డ్‌ వంటి సంస్థలు గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానికంగా భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయంటూ ట్వీట్ లో బైడెన్ పేర్కొన్నారు. అయితే అమెరికాలో విద్యుత్ వాహన శ్రేణి భవిష్యత్ పై పెట్టిన పోస్టులో ‘టెస్లా’ పేరును బైడెన్ ప్రస్తావించకపోవడం పట్ల ఎలాన్ మస్క్ అసహనం వ్యక్తం చేశారు. తన సంస్థ పేరును (టెస్లా) పేర్కొంటూ జో బైడెన్‌కు రీ ట్వీట్‌ చేశారు మస్క్. బైడెన్ ఒక "డ్యాంప్ సాక్ పప్పెట్(మానవ రూపంలో ఉన్న తోలుబొమ్మ)" అంటూ మరో ట్వీట్‌కు బదులిస్తూ అమెరికా అధ్యక్షుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను బైడెన్ ఫూల్స్ లా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పలువురు నెటిజన్లూ బైడెన్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రెండు సంస్థల పేర్లనే బహిరంగంగా ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ వాహన రంగంలో కొత్త చరిత్రను లిఖించిన సంస్థను ఆ చరిత్ర నుంచి చెరిపేసే కుట్ర చేస్తున్నారంటూ బైడెన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Elon Musk, Joe Biden, Tesla Motors, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు