కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజిపై ఉగ్రవాదుల దాడి... భారీ ఆపరేషన్‌తో మట్టుపెట్టిన పోలీసులు...

పోలీసుల యూనీఫాంలో ఉగ్రవాదులు రావడంతో... ఎవరూ వారిని గుర్తించలేకపోయారు. తీరా దాడి జరగగానే అలర్టైన పోలీసులు... అందర్నీ మట్టుపెట్టారు.

news18-telugu
Updated: June 29, 2020, 12:59 PM IST
కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజిపై ఉగ్రవాదుల దాడి... భారీ ఆపరేషన్‌తో మట్టుపెట్టిన పోలీసులు...
కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజిపై ఉగ్రవాదుల దాడి... భారీ ఆపరేషన్‌తో మట్టుపెట్టిన పోలీసులు... (credit - twitter)
  • Share this:
సోమవారం ఉదయం... పాకిస్థాన్‌లోని కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజి దగ్గర ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చింది. ఆ ప్రాంతం మొత్తం దుమ్ము, ధూళితో నిండిపోయింది. గ్రనేడ్ దాడి జరిగిందని పోలీసులకు అర్థమైంది. వెంటనే అలర్ట్ అయ్యారు. నలుగురు ఉగ్రవాదులు కరాచీ స్టాక్ ఎక్స్‌ఛేంజిలోకి ప్రవేశించారు. ఆ నలుగుర్నీ పోలీసులు తర్వాత మట్టుపెట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితిని తగ్గిస్తూ... పోలీసులు... అంతా క్లియర్ చేస్తున్నారు. అధికారులు, వ్యాపారులూ, ఉద్యోగులూ అందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గ్రనేడ్ దాడి తర్వాత... గన్ ఫైర్ వినిపించింది. అప్పటికే పరుగులు పెడుతున్న పోలీసులు... ఆ ఏరియా మొత్తాన్నీ తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. నిజానికి అదో హై సెక్యూరిటీ జోన్. అక్కడ చాలా బ్యాంకులకు చెందిన హెడ్ ఆఫీస్‌లు ఉంటాయి.

అనుమానితుల కదలికలను గుర్తించిన పోలీసులు... కాల్పులు జరిపారు. పెద్ద ఎత్తున ఫైరింగ్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత... ఐదుగురు ఉగ్రవాదులు చనిపోగా... మరొకరు గాయపడినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానితులు పోలీస్ యూనిఫాంలో రావడం వల్ల వెంటనే వాళ్లను గుర్తించలేకపోయామని పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రవాదుల దాడి వెనక బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ హస్తం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
First published: June 29, 2020, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading