కాబుల్‌లో కారు బాంబు పేలుడు.. 10 మంది మృతి..

గడిచిన నాలుగైదు రోజుల్లో కాబూల్‌లో పేలుళ్ల ఘటన జరగడం ఇది రెండోసారి. దీంతో పేలుడు సంభవించిన ప్రాంతంలో పోలీసులు రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు.

news18-telugu
Updated: September 5, 2019, 3:35 PM IST
కాబుల్‌లో కారు బాంబు పేలుడు.. 10 మంది మృతి..
నమూనా చిత్రం( REUTERS/Omar Sobhani - RC19201C03B0)
news18-telugu
Updated: September 5, 2019, 3:35 PM IST
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం శష్ దరక్ ప్రాంతంలోని అమెరికా ఎంబసీ,నాటో కార్యాలయాలకు సమీపంలో కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. ఇందులో సాధారణ పౌరులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.పేలుళ్లు తమ చర్యనే అని తాలిబన్లు ప్రకటించారు.తాలిబన్లతో శాంతి చర్చల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ సైనికులను అమెరికా ఉపసంహరించుకున్న కొన్ని గంటలకే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. గడిచిన నాలుగైదు రోజుల్లో కాబూల్‌లో పేలుళ్ల ఘటన జరగడం ఇది రెండోసారి. దీంతో పేలుడు సంభవించిన ప్రాంతంలో పోలీసులు రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు.కాగా, సోమవారం రాత్రి తూర్పు కాబుల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది చనిపోగా.. 100కు పైగా తీవ్రంగా గాయపడ్డారు.




First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...