• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • TELUGU NRI LEADERS FACILITATE HONBLE CONSUL GENERAL OF INDIA MAHAJAN IN DALLAS FULL DETAILS HERE HSN

అమెరికాలో భారత కాన్సూల్ జనరల్ కు ఎన్నారై సంఘాల నేతల ఆతిథ్యం.. ఘన సత్కారం..

అమెరికాలో భారత కాన్సూల్ జనరల్ కు ఎన్నారై సంఘాల నేతల ఆతిథ్యం.. ఘన సత్కారం..

భారత కాన్సూల్ జనరల్ కు ఎన్నారై సంఘాల నేతల ఆతిథ్యం

విద్య, ఉపాధి అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో తెలుగు వాళ్లు అమెరికా బాట పట్టిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో తెలుగు పౌరులు అమెరికాలో నివసిస్తున్నారు. అక్కడ స్థిరపడిన ఎన్నారైలు సంఘాలుగా ఏర్పడి మాతృభాష కోసం..

  • Share this:
    డల్లాస్, టెక్సాస్: కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్ కు ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఆతిథ్య సమావేశం జరిగింది. ఇర్వింగ్ బావర్చి రెస్టారెంట్ లో గురువారం నాడు ఏర్పాటు చేసిన ఆతిధ్య సమావేశంలో వివిధ తెలుగు సంఘాల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. రఘువీర్ బండారు – తెలంగాణా పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టిపాడ్), డా. శ్రీధర్ కొర్సపాటి – నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ (నాటా), డా. సంధ్యా రెడ్డి గవ్వ – అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), లక్ష్మి పాలేటి - తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్టేక్ష్), మురళి వెన్నం - తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), శేఖర్ అన్నే- నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్), మహేంద్ర రావు – డల్లాస్ ఏరియా తెలంగాణా అసోసియేషన్ (డాటా) తదితరులు ఈ ఆతిథ్య సమావేశంలో పాల్గొన్నారు. స్థానికంగాను, జాతీయ స్థాయిలోను, మాతృ దేశంలో ను చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను ఆయా సంఘాల నేతలు కాన్సల్ జెనరల్ కు వివరించారు.

    ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ తెలుగు సంఘాల ప్రతినిధుల తరపున డా. ప్రసాద్ తోటకూర కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్ ను దుశాలువా, జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. తనకు ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన ఈ అభినందనకు కాన్సల్ జెనరల్ మహాజన్ కృతజ్ఞతలు తెలియ జేస్తూ – “అమెరికాలో తెలుగు వారి విజ్ఞానం, ఆధిక్యత - విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక, వ్యాపారం లాంటి అన్ని రంగాలలోను విశేష ప్రభావం చూపుతోందని ప్రశంసిస్తూ, అవసరమైనప్పుడు వీలైన సహాయం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

    కాగా విద్య, ఉపాధి అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో తెలుగు వాళ్లు అమెరికా బాట పట్టిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో తెలుగు పౌరులు అమెరికాలో నివసిస్తున్నారు. అక్కడ స్థిరపడిన ఎన్నారైలు సంఘాలుగా ఏర్పడి మాతృభాష కోసం, పుట్టిన నేల అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సొంతూళ్లను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు