అమెరికాలో వెలుగుతున్న తెలుగు భాష!

అమెరికాలో ఏడేళ్లలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగింది. హిందీ టాప్ ప్లేస్‌లోనే ఉంది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

news18-telugu
Updated: August 29, 2019, 5:40 AM IST
అమెరికాలో వెలుగుతున్న తెలుగు భాష!
అమెరికాలో ఏడేళ్లలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగింది. హిందీ టాప్ ప్లేస్‌లోనే ఉంది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
  • Share this:
అమెరికాలో తెలుగు మాట్లాడేవాళ్ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2010 నుంచి 2017 మధ్య తెలుగు మాట్లాడేవాళ్ల సంఖ్య ఏకంగా 86% పెరిగింది. అమెరికాలో ఫారిన్ భాషలకు ఉన్న ఆదరణపై సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్(సీఐఎస్) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలిన లెక్కలివి. అమెరికాలో తెలుగు మాట్లాడేవాళ్ల సంఖ్య 2000వ సంవత్సరంలో 87,543 ఉండగా 2010లో ఆ సంఖ్య 2,22,977 వరకు పెరిగింది. 2017లో ఈ సంఖ్య 4,15,414. ఏడేళ్లలో 86 శాతం పెరిగిందన్నమాట.

telugu language speakers, america, USA, NRI, center for immigration studies, తెలుగు భాష మాట్లాడేవాళ్లు, అమెరికా, యూఎస్ఏ, ఎన్‌ఆర్ఐ, సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్
image: center for immigration studies


తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లు అమెరికాలో టెక్, ఇంజనీరింగ్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ప్రతీ ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు అమెరికాకు తరలివెళ్తుంటారు. 2008 నుంచి 2012 మధ్య 26 వేల మంది విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్లారు. అమెరికా గడ్డపై ఇలాంటి వలస పక్షుల విజయ గాథలెన్నో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్‌ లాంటివాళ్లు తెలుగువాళ్లే. అక్కడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో తెలుగువారే ఎక్కువ. 2013లో మిస్ అమెరికా కిరీటాన్ని గెలుచుకున్న ఇండియన్ అమెరికన్ నీనా దావులూరి విజయవాడ అమ్మాయి. ఇలా తెలుగువాళ్ల సక్సెస్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి. తెలుగువారి విషయంలో అమెరికాలో కొన్ని విషాదాలు కూడా ఉన్నాయి. కొందరు ఉన్మాదుల దురంహంకారానికి బలైనవారిలో తెలుగువారే ఎక్కువ. ద్వేషపూరిత నేరాల్లో తెలుగువారే టార్గెట్ అవుతున్నారు.

మరోవైపు అమెరికాలోని తెలుగు సంఘాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సత్తాచాటుతుంటాయి. యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర... డ్యాన్స్, మ్యూజిక్, కల్చర్ అండ్ ఆర్ట్స్‌లో కోర్సులు నిర్వహిస్తోంది. ప్రధాన కాలేజీలు కూడా ఇందుకోసం తమ వంతు సహకారాన్ని అందిస్తుండటం విశేషం. భారతదేశం నుంచి అమెరికాకు ఎంతోమంది వలస వెళ్లినా... తెలుగు భాషకే ఎక్కువగా ఆదరణ లభిస్తోంది.అమెరికాలో ఇతర భారతీయ భాషలు
తెలుగు తర్వాత 2010-17 మధ్య బెంగాలీ 57%, తమిళ్ 56%, హిందీ 42 %, పంజాబీ 26%, గుజరాతీ 22% ఆదరణ పెరిగింది. అయితే భాష మాట్లాడేవారి సంఖ్య చూస్తే... హిందీ టాప్ ప్లేస్‌లోనే ఉంది. అమెరికాలో హిందీ 8.6 లక్షలు, గుజరాతీ 4.3 లక్షలు, తెలుగు 4.2 లక్షలు, బెంగాలీ 3.5 లక్షలు, పంజాబీ 3.1 లక్షలు, తమిళ్ 2.1 లక్షల మంది మాట్లాడుతున్నారు.

telugu language speakers, america, USA, NRI, center for immigration studies, తెలుగు భాష మాట్లాడేవాళ్లు, అమెరికా, యూఎస్ఏ, ఎన్‌ఆర్ఐ, సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్
(Image: Network18 Creative)
ఇవి కూడా చదవండి:

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?

యూత్ కోసం మరో రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్!

ఫోర్బ్స్ భావి సంపన్నులుగా ఉపాసన, పీవీ సింధు!

ఆరోగ్య సేవలో ఉపాసన కామినేని

ఇండియాలో లాంఛైన సాంసంగ్ గెలాక్సీ ఏ7
First published: August 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>