భార్యను బతిమాలి లాటరీ కొన్నాడు.. రూ.28కోట్లు గెలిచాడు...

భార్యను బతిమాలి ఆమె దగ్గర రూ.20వేలు తీసుకున్నాడు. ఆ డబ్బును దుబాయ్‌లో ఉన్న తన ఫ్రెండ్‌కి పంపించి.. తన పేరు మీద మూడు లాటరీ టికెట్లు కొనాలని సూచించాడు.

news18-telugu
Updated: August 4, 2019, 7:19 PM IST
భార్యను బతిమాలి లాటరీ కొన్నాడు.. రూ.28కోట్లు గెలిచాడు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 4, 2019, 7:19 PM IST
తెలంగాణకు చెందిన ఓ రైతుకు బంపర్ లాటరీ తగిలింది. దుబాయ్‌లో కొన్న ఓ లాటరీ టికెట్‌కు సుమారు రూ.28 కోట్ల నగదు బహుమతి లభించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రిక్కల విలాస్.. కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రెండేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు. అయితే, ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం చాలా రోజులు వెతికాడు. కానీ, ఉద్యోగం దొరకలేదు. దీంతో చేసేది లేక 45 రోజుల క్రితం ఇండియాకి వచ్చేశాడు. అయితే, యూఏఈలో ఉన్నప్పుడు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. సొంతూరు వచ్చిన తర్వాత కూడా లాటరీ టికెట్ల మీద మనసు చావలేదు. దీంతో భార్యను బతిమాలి ఆమె దగ్గర రూ.20వేలు తీసుకున్నాడు. ఆ డబ్బును దుబాయ్‌లో ఉన్న తన ఫ్రెండ్‌కి పంపించి.. తన పేరు మీద మూడు లాటరీ టికెట్లు కొనాలని సూచించాడు. ఆ ఫ్రెండ్ అలాగే చేశాడు. ఇప్పుడు ఆ టికెట్లకే లాటరీ తగిలింది. తన భార్య వల్లే ఈ లాటరీ వచ్చిందని విలాస్ చెప్పాడు. ఇక పేరులో ఉన్న విలాసం జీవితంలోకి కూడా వస్తుందేమో.

First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...