Home /News /international /

TAX RICH TO FUND VACCINES FOR POOR HIT BY PANDEMIC OXFAM PVN VB

Tax On Billionaires: బిలియనీర్లపై భారీగా పన్ను..పేదలకు ఫ్రీగా వాక్సిన్.. ప్రభుత్వాలకు ఆక్స్‌ఫామ్ కీలక సూచన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన విషయం అందరికి తెలిసిందే. .కొన్ని దేశాలు తమ ప్రజలకు కోవిడ్ వాక్సిన్ కూడా అందించలేకపోతున్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే తమ ప్రజలకు రెండు డోసుల వాక్సిన్ తో పాటు బూస్టర్ డోసును, నాల్గవ డోసు వాక్సిన్ ను కూడా అందించగలుగుతున్నాయి.

ఇంకా చదవండి ...
  కరోనా మహమ్మారి(Covid 19) కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన విషయం అందరికి తెలిసిందే. . కొన్ని దేశాలు తమ ప్రజలకు కోవిడ్ వాక్సిన్(Vaccine) కూడా అందించలేకపోతున్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే తమ ప్రజలకు రెండు డోసుల వాక్సిన్ తో పాటు బూస్టర్ డోసును(Booster Dose), నాల్గవ డోసు వాక్సిన్ ను కూడా అందించగలుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో రకరకాల వేరియంట్ల(Varient) రూపంలో కోవిడ్ మళ్ళీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో పేదరిక వ్యతిరేక సంస్థ "ఆక్స్‌ఫామ్" ప్రపంచ దేశాలకు కీలక సూచనలు చేసింది.. ప్రపంచ అసమానతలను విస్తృతంగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ బిలియనీర్లపై ప్రభుత్వాలు ఒకేసారి 99 శాతం పన్ను విధించాలని, పేదల కోసం వ్యాక్సిన్‌ల విస్తృత ఉత్పత్తికి ఆ నిధులను ఉపయోగించాలని ఆక్స్‌ఫామ్(oxfam)సోమవారం పిలుపునిచ్చింది.

  Crisis: భారీ ఆర్థిక సంక్షోభంలో పొరుగు దేశం.. చుక్కలనంటిన ధరలతో విలవిల..


  ఆర్థిక ఉద్దీపనల కారణంగా మహమ్మారి సమయంలో ధనిక దేశాలు నిలదొక్కుకున్నాయని, ఇదేసమయంలో వ్యాక్సిన్‌ ల పంపిణీ విషయంలో అసమానల కారణంగా పేద దేశాలు తమ వాటా కంటే ఎక్కువ నష్టపోయాయని,ధనిక దేశాలకు మాత్రమే వాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయని ఆక్స్‌ఫామ్ ఓ రిపోర్ట్ (Report)లో తెలిపింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని చాలామంది బిలియనీర్లు మరింత ధనవంతులయ్యారని, కోవిడ్ మహమ్మారి ఒక బిలియనీర్ బొనాంజా" అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(Excutive Director)గాబ్రియేలా బుచెర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

  CoWIN Registration for Children: పిల్ల‌ల‌కు కోవిడ్‌ వ్యాక్సిన్.. ఎప్ప‌టి నుంచి రిజిస్ట‌ర్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి!

  ప్రభుత్వాలు.. ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించినప్పుడు, ఆర్థిక వ్యవస్థకు మద్దతులో భాగంగా ఎకానమీలోకి లక్షల కోట్ల రూపాయలను ప్రవేశపెట్టినప్పుడు ఇందులోని చాలా భాగం నిధులు బిలియనీర్ల జేబుల్లోకి వెళ్లాయని బుచెర్ తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి అనేది మహమ్మారిపై ఒక గొప్ప విజయం. అయితే సంపన్న దేశాల దగ్గరే వాక్సిన్ నిల్వ చేయబడిందని బుచెర్ చెప్పారు. మార్చి 2020లో మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి, దాదాపు ప్రతిరోజూ ఒక కొత్త బిలియనీర్ తెరపైకి వస్తున్నారు. ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్ మరియు బిల్ గేట్స్‌తో సహా ప్రపంచంలోని 10 మంది ధనవంతుల సంపద రెండింతలు కంటే ఎక్కువ పెరిగిందని, ఇది ప్రపంచంలోని అత్యంత పేదరికంలో ఉన్న 300 కోట్లకుపైగా ప్రజల కంటే వారిని ఆరు రెట్లు ఎక్కువ సంపన్నులుగా మార్చినట్లు ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో 16 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని తెలిపింది.

  Covid 19 Vaccine: బూస్ట‌ర్ డోస్ తీసుకోవాలంటే.. సెకండ్ డోస్ త‌ర్వాత‌ ఇంత గ్యాప్ త‌ప్ప‌నిస‌రి!

  కోవిడ్-19 వ్యాక్సిన్‌ల ఉత్పత్తిని విస్తరించే ప్రయత్నంలో సంపన్న దేశాలు మేధో సంపత్తి(intellectual property) నిబంధనలను వదులుకోవాలని ఆక్స్‌ఫామ్ పిలుపునిచ్చింది. 10 మంది ధనవంతులపై ఒక్కసారిగా 99 శాతం పన్ను విధించడం ద్వారా 800 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపాదించవచ్చనని, వీటిని ఇతర ప్రగతిశీల సామాజిక వ్యయాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించవచ్చునని సూచించింది. ఈ డబ్బుతో.. మొత్తం ప్రపంచానికి వ్యాక్సిన్‌ లను అందించవచ్చునని, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య వ్యవస్థలను కలిగి ఉండవచ్చునని బుచెర్ చెప్పారు.

  SSD Storage: మీ ల్యాప్‌టాప్‌ స్లో అవుతోందా..? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ SSD స్టోరేజ్​ ప్రొడక్ట్స్‌ను ప్రయత్నించండి..


  అంతేకాకుండా వాతావరణ మార్పుల వాళ్ళ కలుగుతున్న నష్టాన్ని కూడా భర్తీ చేయగలము మరియు లింగ-ఆధారిత హింసను పరిష్కరించే పాలసీలను కూడా కలిగి ఉంటాము అని బుచెర్ చెప్పారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా మరియు చైనా దేశాలు... సంపన్నులపై పన్ను రేట్లు పెంచడం మరియు కార్పొరేట్ గుత్తాధిపత్యంపై చర్యలు తీసుకోవడం వంటి అసమానతను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన విధానాలను పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది.
  Published by:Veera Babu
  First published:

  Tags: Covid 19 restrictions, International news, Vaccinated for Covid 19

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు