Tasleema Nasreen : హిందువులపై దాడులకు నేను సిగ్గుపడుతున్నాను..

Tasleema Nasreen

Tasleema Nasreen : బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులను వివాదస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా ఖండించారు. దాడి చేయడం పట్ల సిగ్గుపడుతున్నానని తస్లీమా నస్రీన్‌ అన్నారు.పలు ట్విట్ల ద్వారా అక్కడి ప్రభుత్వానికి చురకలు అంటించారు.

 • Share this:
  బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను పలు దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇందులో బాగంగా ఆ దేశ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఆమె అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు హిందువుల భద్రతకు భరోసా కల్పించాలని ఆమె కోరారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో జరిగిన హింసలో నిరాశ్రయులైన, ఏడుస్తున్న వ్యక్తుల చిత్రాలను కూడా ఆమె ట్వీట్‌తో జత చేశారు.

  హిందువులపై దాడి ( Attack on Hidus ) చేయడం పట్ల సిగ్గుపడుతున్నానని తస్లీమా నస్రీన్‌ ( Tasleema Nasreen) ట్విట్ ద్వారా తెలిపారు. ఇండ్లు తగలబడిపోవడం, కూల్చివేయడంతో వందలాది మంది హిందువులు నిరాశ్రయులయ్యారని ఆమె విచారం వ్యక్తం చేశారు. నా దేశం ఏడుస్తున్నదని మరొక ట్వీట్‌లో ( tweet ) రాశారు. హిందీ సినిమాలోని 'తూ హిందూ బనేగా.. నా ముస్లిం బనేగా..' పాటను తస్లీమా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లలో హిందువుల దేవతలను ధ్వంసం చేసిన తీరును, కూల్చివేసిన మండపాల ఫొటోలను కూడా తస్లీమా షేర్‌ చేసింది.

  ఇది చదవండి : ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్


  దీంతో హిందువుల భద్రతకు ( Hindu Security  ) అన్ని చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశానికి హామీ ఇచ్చింది. ఈ దాడులతో తాలిబన్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం తెల్చిచెప్పింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్‌లోని కుమిల్లాలోని దుర్గా పూజ వేదిక వద్ద మత దూషణ కారణంగా హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి.సోషల్ మీడియాలో మత విద్వేషాల వ్యాప్తికి సంబంధించి పోస్టులు చేసిన డజన్ల కొద్దీ మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.

  ఇది చదవండి : అదృష్టం తలుపు తట్టేలోపు దురదృష్టం షేక్ హ్యాండ్.. లాటరీ గెల్చుకున్న తరువాత అష్టకష్టాలుపడ్డ దంపతులు


  బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్.. చాంద్పూర్, నోఖాలీలో జరిగిన దాడులలో కనీసం నలుగురు హిందూ భక్తులు మరణించారని ఆరోపించారు. ఇంతలో ఢాకా నుండి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెనిలో హిందువులకు చెందిన దేవాలయాలు, దుకాణాలపై దాడులకు సంబంధించి ఎలైట్ నేర నిరోధక శక్తి రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. “మతపరమైన హింసకు పాల్పడినందుకు, సోషల్ మీడియాలో ప్రజలను ప్రేరేపించినందుకు వారిని అరెస్టు చేశారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

  మరోవైపు ప్రధాన మంత్రి షేక్ హసీనా హింస వెనుక ఉన్న దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చింది. హిందూ దేవాలయాలు, కుమిల్లాలోని దుర్గా పూజ వేదికలపై దాడుల్లో పాల్గొన్న తప్పించుకోలేరని తెలిపారు. ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారు ఏ మతానికి చెందినవారైనా శిక్షించబడతారని ధాకేశ్వరిలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు.
  Published by:yveerash yveerash
  First published: