యూకేలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు.. ముఖ్య అతిథిగా హాజరైన బాబూమోహన్

Telugu Association of Scotland ఉగాది సంబరాలు

తెలుగు వారు తమ పుట్టిన గడ్డను విడిచి ఉన్నతోద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నా తెలుగు భాషను, సంస్కృతిని మర్చిపోవడం లేదు. ప్రతీ తెలుగు పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

 • Share this:
  యూకేలోనే అతి పురాతనమైన, అతి పెద్దదైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ వారు తమ 19వ వార్షికోత్సవాన్ని “ఉగాది సంబరాలు 2021” ద్వారా ఏప్రిల్ నెల 18 న ఘనంగా జరుపుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సంవత్సరం కూడా కార్యక్రమం మొత్తం అంతర్జాలంలోనే జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఆ సంస్థ చైర్మన్ మైధిలి కెoబూరి దీపారాధనతో ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ నిరంజన్ నూక మాట్లాడుతూ తాము ఈ సంవత్సరం కూడా ఉగాది సంబరాలను అంతర్జాలంలో జరుపుకోవడానికి ప్లాన్ చేశామని చెప్పారు. తర్వాత వ్యాఖ్యాత కార్యక్రమాన్ని కొనసాగించారు. ఐటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ పర్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, సీనియర్ హాస్య నటుడు డాక్టర్ బాబు మోహన్ ను సాదరంగా కార్యక్రమానికి ఆహ్వానించారు. బాబు మోహన్ తన సినిమా ప్రస్థానం గురించి మరియు రాజకీయ అనుభవం గురించి తెలుగు ప్రజలతో ముచ్చటించారు.

  తర్వాత ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ స్కాట్లాండ్, UK ప్రజలను ఉద్దేశించి బాబూమోహన్ ప్రసంగించారు. తర్వాత విజయ్ కుమార్ పర్రి గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ తరపున తాము అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అందులో భాగంగా మదర్స్ డే సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఒక కార్యక్రమ రూపకల్పన చేశామని తెలియజేశారు. భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్ కోసం విద్యార్థులు వస్తున్న తరుణంలో వారికి సంబంధించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. TAS సంస్థ ఇంతటి విజయానికి కారణం సంస్థలోని కార్యదర్శులతో పాటు స్కాట్లాండ్ (యునైటెడ్ కింగ్డమ్) లోని తెలుగు ప్రజల సహకారం మరియు సమిష్టి కృషి కారణమని తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా అందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు అందజేశారు.
  ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

  తర్వాత అధ్యక్షుడు శివ చింపిరి మాట్లాడుతూ తాము గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు సాధించిన ప్రజాభిమానం, అంతర్జాతీయ కార్యక్రమాలు టాస్ అభివృద్ధికి కీలక మెట్టు అని తెలిపారు. తర్వాత బాబు మోహన్ తో వారి చిన్ననాటి జ్ఞాపకాలను తెలుపుతూ ముచ్చటించారు. తర్వాత ప్రాజెక్ట్స్ మరియు మహిళా శాఖ కార్యదర్శి మాధవి లత మాట్లాడుతూ తాము అనేక సైకిల్ ప్రాజెక్ట్ ను తీసుకు రాబోతున్నట్లు తెలిపారు, వీటిని సద్వినియోగంచేసుకోవాల్సిందిగా కోరారు. సుమారుగా 30 రకాల పాటలు, డాన్సులు, కామిడీ స్కిట్లు, శాస్త్రీయ సంగీతం మరియ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అందులో ముఖ్యంగా ‘మన బడి’ పాఠశాల చిన్నారులు ‘మా తెలుగు తల్లికి’ గేయాన్ని చాలా చక్కగా ఆలపించారు. కార్యక్రమం చివర్లో జనరల్ సెక్రటరీ శ్రీ ఉదయ్ కుమార్ కె వీక్షకులకు, ప్రజలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తరువాత కార్యక్రమం జనగణమన జాతీయ గీతంతో ముగిసింది.
  ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
  Published by:Hasaan Kandula
  First published: