Tara Air flight missing : నేపాల్ కు చెందిన విమానం ఆచూకీ గల్లంతైంది. తారా ఎయిర్లైన్స్ కు చెందిన 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం..ఆదివారం ఉదయం పోఖ్రా నుంచి జమ్సోమ్ కి బయల్దేరింది. అయితే కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 19 మంది ప్రయాణికులు,ముగ్గురు సిబ్బంది కలిపి మొత్తం 22 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయని సమాచారం.
జమ్సోమ్ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ప్రకారం... జమ్సోమ్ జిల్లాలోని ఘాసాలో పెద్ద శబ్దం గురించి వారికి సమాచారం అందింది. దీంతో ఆచూకీ గల్లంతైన విమానాన్ని వెతికేందుకు రెండు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది నేపాల్ హోంశాఖ. ముస్టాంగ్, పోఖ్రీ నుంచి ఇవి గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది. మరోవైపు.. నేపాల్ ఆర్మీ చాపర్ ఎంఐ-17 సైతం మోహరించినట్లు హోంశాఖ ప్రతినిధి ఫదింద్ర మని మోహరించినట్లు తెలిపారు. సంబంధాలు తెగిపోయిన ముస్టాంగ్లోని లేటే ప్రాంతంలో గాలిస్తున్నట్లు తెలిపారు. విమానంలో 13 మంది నేపాలీలు, నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.
కాగా, జమ్సోమ్ ప్రాంతానికి విదేశీ ట్రెక్కర్లు ఎక్కువగా వస్తుంటారు. అలాగే,ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్, నేపాలీ భక్తులు పర్యటిస్తారు. ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించాలంటే దగ్గర్లోని ఎయిర్ పోర్ట్ ఇదే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight Accident, Nepal