TANA ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం.. తెలుగు సాహిత్య వినీలాకాశంలో హరికథా ప్రాభవం..

TANA సంస్థ

అమెరికాలోని తానా(TANA) సంస్థ కూడా తెలుగు భాషను భావి తరాలకు అందించే విషయంలోనూ, తెలుగు సాహిత్యాన్ని కాపాడేందుకు గానూ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ’తానా ప్రపంచ సాహిత్య వేదిక‘ ను ఏర్పాటు చేసింది.

  • Share this:
    ఉన్నత ఉద్యోగావకాశాల కోసం దేశాలు దాటినా తెలుగు భాషపై మమకారాన్ని మాత్రం ప్రవాసులు వదులుకోలేదు. ఉపాధి కోసం ఆంగ్లభాషను నమ్ముకున్నా మాతృ భాషపై ఉన్న అభిమానాన్ని మాత్రం చూపుతూనే ఉన్నారు. తమ ఇళ్లల్లో తెలుగు భాషనే మాట్లాడుతుంటారు. అమెరికా గడ్డపై పుట్టిన తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తుంటారు. అమెరికాలోని తానా(TANA) సంస్థ కూడా తెలుగు భాషను భావి తరాలకు అందించే విషయంలోనూ, తెలుగు సాహిత్యాన్ని కాపాడేందుకు గానూ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ’తానా ప్రపంచ సాహిత్య వేదిక‘ ను ఏర్పాటు చేసింది. ఈ వేదిక ఆధ్వర్యంలో ప్రతీ నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం జరుగుతుంది.

    ఫిబ్రవరి 28వ తారీఖున కూడా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8గంటల 30 నిమిషాలకు (అమెరికా – 7:00AM PST; 9:00AM CST; 10:00 AM EST) ఈ కార్యక్రమం జరగబోతోంది. ’తెలుగు సాహిత్య వినీలాకాశంలో హరికథా ప్రాభవం‘ అనే అంశంపై ప్రత్యేక చర్చను నిర్వహిస్తారు. తిరుపతికి చెందిన ప్రముఖ కథకులు వాచస్పతి డాక్టర్ ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రి చే భక్తపోతన సాహిత్య వైభవం (హరికథా గానం) జరుగుతుంది. తెలుగు భాషపై మమకారం ఉన్న అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే.
    ఇది కూడా చదవండి: ప్రపంచ భాషల్లోకి తెలుగు సాహిత్యాన్ని అనువాదం చేయాలి.. TANA వేదికపై పిలుపునిచ్చిన వెంకయ్యనాయుడు

    YuppTV లోని TANA TV ఛానెల్ ద్వారా కానీ, https://www.facebook.com/tana.org ఫేస్ బుక్ పేజీ ద్వారా కానీ, https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw లింక్ ద్వారా యూట్యూబ్ లైవ్ లో కానీ ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. మరిన్ని వివరాలకు www.tana.org ను సందర్శించవచ్చని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఓ ప్రకటనలో తెలిపారు.

    TANA విడుదల చేసిన ప్రకటన

    ఇది కూడా చదవండి: గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్.. దెయ్యం భయంతో ఇళ్లన్నీ ఖాళీ.. అసలు అక్కడ ఏం జరుగుతోందంటే..
    Published by:Hasaan Kandula
    First published: