గత ఏడాది అఫ్ఘానిస్తాన్ (Afghanistan) దేశం తాలిబన్ల (Taliban) వశమయింది. ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తూ.. యావత్ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం రాగానే అక్కడి ప్రజల్లో ప్రాణాలరచేత పట్టుకొని బతుకుతున్నారు. ఎందుకంటే తాలిబన్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉండదు. వారు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం..! కాదని ఎవరైనా ఎదురించారా...? తల తెగిపడుతుంది. తాలిబన్లు అధికారం చేపట్టిన వెంటనే.. ఆఫ్ఘన్లో విధ్వంస పాలన మొదలయింది. ముఖ్యంగా మహిళలు నరకం చూస్తున్నారు. బురఖా లేనిదే.. వారు బయటకు రాకూడదు. పరాయి వ్యక్తితో కనిపించకూడదు. కనీసం ఉద్యోగం కూడా చేసుకోకూడదు. పొరపాటున ఎవరైనా పరాయి పురుషుడితో కనిపించిదా.. అంతే ఆమెకు ఉరిశిక్ష పడడం ఖాయం. సాధారణ మహిళలనే అంత క్రూరంగా చంపుతున్నప్పుడు..ఇక పోర్న్ స్టార్ (Adult Star) పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు.
Emma Magnolia: రైతుగా మారనున్న పోర్న్ స్టార్.. నీలి చిత్రాలకు గుడ్‌బై చెప్పి పొలం పనులకు..
అఫ్ఘనిస్తాన్‌లో ఒకే ఒక్క అడల్ట్ స్టార్ ఉంది. ఆమె పేరు యాస్మినా (Yasmina). ఆఫ్ఘన్ వన్ అండ్ ఓన్లీ పోర్ట్ సార్ట్గా యాస్మినా పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఈమెకు తాలిబన్ల భయం పట్టుకుంది. ఎప్పుడు తనను చంపేస్తారేమోనని వణికిపోతోంది. వాస్తవానికి ఆమె ఆఫ్ఘనిస్తాన్‌లో లేదు. 1990లోనే దేశం విడిచి వెళ్లిపోయిది. ఆ సమయంలో అప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలనలో ఉండేది. అప్పుడు అప్ఘానిస్తాన్ నుంచి పారిపోయి.. యూకేలో స్థిరపడింది యాస్మినా. అక్కడే చదవడం, రాయడం నేర్చుకుంది. బాగానే చదువుకుంది. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు అప్ఘనిస్తాన్ మళ్లీ తాలిబన్ల వశం కావడంతో.. యాస్మినా చాలా భయపడుతోంది.
YouTube channels blocked : 35 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం..
అప్ఘన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె వేరొక మతాన్ని స్వీకరించారు. యూకేలో ఉంటూ తన పనులను తాను చేసుకుంటున్నారు. కానీ అప్ఘన్లో తాలిబన్ల పాలన మొదలయ్యాక.. యాస్మినాకు మళ్లీ టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే.. అప్ఘనిస్తాన్ ఏకైక పోర్న్ స్టార్ అని యాస్మినాకు పేరుంది. తన అడల్డ్ సినిమా వల్ల అప్ఘనిస్తాన్కు పేరు రావడం తాలిబన్లకు ఇష్టం లేదని.. అందుకే తనను తాలిబన్లు టార్గెట్ చేశారని.. ఇటీవల ఐ హేట్ పోర్న్ అనే పాడ్ కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. తన గురించి తాలిబన్లు ఆరా తీస్తున్నారని.. దొరికితే తల నరికి చంపేస్తారని ఆమె తెలిపారు. యాస్మినా పేరు గూగుల్‌లో కొట్టగానే.. ఆమె పేరు, ఇతర వివరాలన్నీ కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనను చంపడం వారికి పెద్ద కష్టమేమీ కాదని యాస్మినా పేర్కొంది.
67ఏళ్లుగా స్నానమే చేయలేదు.. చెత్త కుప్పలో భోజనం.. కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో చూడండి
Singer Death: కావాలని కరోనా అంటించుకున్న సింగర్.. పాపం.. చివరకు దానికే బలి
ఒక స్త్రీకి తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుందన్నది యాస్మినా అభిప్రాయం. దానిని ఎవరికి చూపించాలన్నది పూర్తిగా తన ఇష్టమని ఆమె చెబుతోంది. ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని. . కానీ తాలిబన్లకు ఇది నచ్చడం లేదని ఆమె వాపోతోంది. స్త్రీలు స్వేచ్ఛగా జీవించడం వారికి నచ్చదని.. అందుకే తనలాంటి వారిని టార్గెట్ చేస్తున్నారని తెలిపింది. తనను ఏ క్షణమైనా తాలిబన్లు చంపవచ్చని చెప్పింది. తాను యూకేలో ఉన్నప్పటికీ.. తాలిబన్లు తలచుకుంటే తనను చంపడం వారికి ఎంత పని? అని యాస్మినా పేర్కొంది. తాలిబన్ల రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు గళమెత్తాలని.. అప్ఘన్ల హక్కుల కోసం పోరాడాలని కోరుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adult film, Afghanistan, International, International news