తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అమెరికా దళాలు ఇప్పటికే ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిగా వదిలి వెళ్లడంతో.. ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్లు ఫోకస్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు దిశగా తాలిబన్లు పలు నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. శుక్రవారం మతపరమైన ప్రార్థనలు ముగిసిన తర్వాత దేశంలో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించనుందని తాలిబన్ వర్గాలు తెలిపాయి. రాజధాని కాబూల్‌లోని అధ్యక్ష భవనంలో ఈ కార్యక్రమం ఉంటుందని తాలిబన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ తెలిపారు. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రోజువారీ పరిపాలనా వ్యవహారాలను తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకునే అవకాశముందని తాలిబన్ ప్రతినిధులు తెలిపారు.
అయితే పరిపాలన కోసం ఎటువంటి మండలి ఏర్పాటైనా దానికి అధినాయకుడిగా తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంజాదా ఉంటారని తెలిపారు. ఇక ఆప్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఉండబోదని వీరి నిర్ణయాలను బట్టి అర్థమవుతోంది. ఇక తాలిబన్ లీడర్ షిప్ కౌన్సిల్ ద్వారా అప్ఘానిస్తాన్ లో ఇకపై పరిపాలన సాగనుంది. దేశంలో ఒక్క పంజ్ షీర్ ఫ్రావిన్స్ తప్ప అన్ని రాష్ట్రాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Huzurabad: హుజూరాబాద్‌లో పోటీకి దూరం.. ఆ పార్టీ ప్రకటన.. టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా ?
Night: రాత్రిపూట తరచూ గొంతు తడారిపోతుందా ?.. చాలా డేంజర్.. దేనికి సంకేతమో తెలుసా..
ఓ వైపు ఆప్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం తాలిబన్లు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు అక్కడ తమ హక్కుల కోసం మహిళలు రోడ్డెక్కారు. రాబోయే ప్రభుత్వంలో మహిళలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. హెరాత్ నగరంలోని సిల్క్ రోడ్డులో 50 మందికి పైగా మహిళలు ప్లకార్డులు చేతపట్టి రోడ్డు మీదకు వచ్చారు. తమకు ఎలాంటి భయం లేదని, ప్రభుత్వంలో మహిళలకు తప్పకుండా స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మహిళల సపోర్ట్ లేకుండా ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే అఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆహార సంక్షోభం తీవ్రమవుతుందనే వార్తలు అఫ్గన్ వాసుల్ని మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అఫ్గన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Taliban