Home /News /international /

TALIBANS NEW RULE WILL SHOW ITS EFFECT ON GIRL EDUCATION IN AFGHANISTAN AK

Afghanistan: తాలిబన్ల కొత్త రూల్.. అమ్మాయిలకు శాపం.. ఇక మళ్లీ పాత రోజులేనా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Afghanistan: అమ్మాయిలు చదువుకోవడానికి ఇబ్బందిగా మారే మరో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు తాలిబన్లు.

    ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ వశమైన తరువాత అక్కడ రూల్స్ మారుతున్నాయి. తాము మారిపోయామని.. గతంలో మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని మొదట్లో చెప్పుకొచ్చిన తాలిబన్లు.. ఆచరణలో మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహిళల విద్యాబోధన విషయంలో తాలిబన్లు తీసుకున్న తాజాగా నిర్ణయం.. అమ్మాయిలు, యువతుల పాలిట శాపంగా మారే అవకాశం ఉందని అక్కడి విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతవారమే ఆఫ్ఘనిస్తాన్‌లో సహావిద్య(కో-ఎడ్యుకేషన్) విధానాన్ని నిషేధించారు తాలబిన్లు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోవడం ఇకపై కుదరదని తేల్చిచెప్పారు.

    తాజాగా అమ్మాయిలు చదువుకోవడానికి ఇబ్బందిగా మారే మరో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు తాలిబన్లు. ఆడపిల్లలకు చదువు చెప్పడానికి పురుషులను అనుమతించరు. దేశంలో అన్ని విద్యా కార్యకలాపాలు షరియా చట్టం ప్రకారం జరుగుతాయని తేల్చిచెప్పారు. అయితే ఈ నిర్ణయం కారణంగా బాలికలను ఉన్నత విద్య నుండి దూరం చేస్తుంది అక్కడి విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం అమ్మాయిలకు విద్యాబోధన అందించే స్థాయిలో మహిళా ఉపాధ్యాయులు లేరు.

    ఆప్ఘనిస్తాన్ ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు..?

    వీరి కొరత ఇప్పటికిప్పుడు తీరే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇది అమ్మాయిలు, యువతులకు విద్యావకాశాలను దూరం చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళల పట్ల ఎలాంటి వివక్ష ఉండదని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన తాలిబన్లు.. ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాలిబన్ల గురించి పుస్తకాల్లో మాత్రమే చదివిన తరం.. ఇప్పుడు వారితో కలిసి జీవించాల్సి వస్తోందని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇక ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఏం జరుగుతుందని అంతా ఊహించారో.. దాదాపుగా అదే జరుగుతోంది. కొద్దిరోజులుగా కాబూల్‌లో బాంబు దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వందమందికి పైగా చనిపోయారు. వారిలో ఆఫ్ఘన్ పౌరులతో పాటు అమెరికా సైనికులు కూడా ఉన్నారు. కాబూల్ విమానాశ్రయం సమీపంలోనే ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులు జరుగుతాయని అమెరికా హెచ్చరిస్తున్నా.. ప్రజలు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ఆ హెచ్చరికలు పట్టించుకోకపోవడం గమనార్హం. వారి భయాలకు తగ్గట్టుగానే తాలిబన్లు తమ వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో కఠిన చట్టాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Afghanistan, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు