Taliban : తాలిబాన్‌ మరో అరాచకం.. జాతీయ మహిళ వాలిబాల్ క్రిడాకారిణి తల నరికారు... !

Taliban : తాలిబాన్‌ మరో అరాచకం.. జాతీయ మహిళ వాలిబాల్ క్రిడాకారిణి తల నరికారు... !

Taliban : తాలిబాన్‌ల ( Taliban) అరాచకం మరోటి వెలుగు చూసింది. తాజాగా ఓ జాతీయ క్రిడాకారిణిని దారుణంగా ( murder ) హతమర్చారు. అంతేకాదు ఆమె మరణంతరం తలను నరికి వేసినట్టు క్రిడా కోచ్ ఓ ఇంటర్యూలో ( Interview ) వెల్లడించింది. అయితే ఈ సంఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నా బయటకు చెబితే మిగతా కుటుంబ సభ్యులను కూడా చంపివేస్తామని బెదిరించడంతో కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదని తెలిపింది.

 • Share this:
  తాలిబాన్‌ల ( Taliban ) అరాచాకాలు ఒక్కొక్కొటిగా వెలుగు చూస్తున్నాయి. అధికారం దాహంతో చెప్పింది ఒకటైతే చేసేది మరోకటి. ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా ఉన్నవారితో పాటు మహిళలపై ( Woman ) ఉక్కుపాదం మోపుతున్న తాలిబాన్లు అనేక మంది మహిళల ఉపాధితో పాటు వారి జీవన విధానంపై కూడా ప్రభావం చూపుతున్నారు. అయితే కొన్ని చోట్ల మహిలపై అత్యాచారాలు, హత్యలు లాంటీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

  ఆఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాలిబాన్‌లు పరిపాలన ( administration ) పేరుతో రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని ఇప్పటికే ప్రజలు నిరసనలు చేస్తున్నా, వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారి తమదే అన్నట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా అఫ్గన్‌ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి ( sports woman ) తల నరికినట్లు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ( Interview ) తెలిపారు. అయితే ఈ దారుణానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు.

  ఇది చదవండి : ఇంట్లో ఎవరు లేరని ప్రియుడిని పిలిపించుకుంది.. తమ్ముడు చూశాడని .. దారణం చేసింది.


  ఆ ఇంటర్యూలో.. కోచ్ అఫ్జలీ అక్టోబర్‌లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు చంపడంతో పాటు కిరాతకంగా ఆమె తలను నరికేశారని తెలిపింది. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించారని అందుకే తాను ఇప్పటి వరకు చెప్పలేకపోయినట్లు పేర్కొంది.

  మహబజిన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున హకీమి ఆడేదని పైగా క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె ఒకరని చెప్పింది. ఆగష్టులో తాలిబన్లు పూర్తి నియంత్రణ తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ చెప్పింది. ప్రస్తుతం వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లు, మిగిలిన మహిళా అథ్లెట్లు గత కొంత కాలంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు ఏ క్షణాన ఏం జరుగుతోందో అనే భయంతో బతుకుతున్నారని అఫ్జలీ వెల్లడించారు. ఈ క్రమంలో చాలా మంది క్రిడాకారులు ఎవరికీ కనిపించకుండా అండర్‌గ్రౌండ్‌లో కూడా జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

  ఇది చదవండి : ఆ రైతులకు రైతు భీమా, రైతు బంధులు రద్దు.. గంజాయి సాగుపై సీఎం కీలక నిర్ణయం


  కాగా గత వారం, అఫ్గనిస్తాన్ నుంచి జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యులను, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించారు.మరో వైపు ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వ​చ్చినప్పటి నుంచి క్రీడలు, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళల కార్యకలాపాలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. బాలికల్లోనూ అత్యధికులు సెకండరీ స్కూలుకు వెళ్లడం కూడా మానేశారు. భవిష్యత్తులో అక్కడ ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందోనని అఫ్గన్‌ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు
  Published by:yveerash yveerash
  First published: