Afghanistan: అమెరికాకు తాలిబన్ల షాక్​.. బుష్​ మార్కెట్​ పేరు.. ముజాహిదీన్​ బజార్​గా మార్పు

అబ్దుల్ ఘనీ బరాదర్ (image credit - twitter - reuters)

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గా మార్చబడింది. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ల పేర్లు కూడా మార్చబడుతున్నాయి. అయితే ఇపుడు ఏకంగా అమెరికాకే షాక్​ ఇచ్చేశారు తాలిబాన్లు.

  • Share this:
    అప్ఘనిస్తాన్ (Afghanistan)​. గత కొద్దిరోజులుగా వణికిపోతోంది. తాలిబన్లు (Talibans) దాడులు చేసి అప్ఘన్​ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాలిబన్లకు భయపడి లక్షలాది మంది దేశం (country) విడిచి ఇతర దేశాలకు (countries) వలసవెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలె తాలిబన్ల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం (new government) ఏర్పాటైంది. అయితే తాలిబాన్లు కొత్త ప్రభుత్వంలో పలు మార్పులకు (changes) శ్రీకారం చుట్టారు. సంస్థలు, నగరాల (cities) పేర్లను మార్చుతున్న తాలిబన్లు ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే పేరు మార్చడానికి కసరత్తు ప్రారంభించారు. ఇంతకు ముందు దేశం పేరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గా మార్చబడింది. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ల పేర్లు కూడా మార్చబడుతున్నాయి. అయితే ఇపుడు ఏకంగా అమెరికాకే షాక్​ ఇచ్చేశారు తాలిబాన్లు.

    బుష్​ మార్కెట్​ పేరు..

    తాజాగా కాబూల్‌ (Kabul)లోని బుష్ మార్కెట్‌ పేరును మార్చేశారు.  అమెరికా (America) మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ పేరున ఉన్నఈ మార్కెట్‌ను ఇపుడు ‘ముజాహిదీన్ బజార్’ అని పేరుతో పిలుస్తున్నారు. మార్కెట్‌ (market)లోని దుకాణదారులు కస్టమర్లను ఆకర్షించడానికి ‘ముజాహిదీన్ బజార్ (mujahidin bazar)’ అనే పేరును తాలిబన్లు ఉపయోగించడం ప్రారంభించారు. స్థానిక న్యూస్ వెబ్‌సైట్ ఖామా ప్రెస్ కథనం ప్రకారం,.. ముజాహిదీన్ తాలిబాన్లను సూచిస్తుంది. ఈ మార్కెట్లో ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అమెరికన్ సైనికుల (American soldiers)కు సైనిక యూనిఫాంలు, షూ లు, గాడ్జెట్‌ (gadgets)లు, జంపర్లు, ప్రోటీన్లు, పానీయాలను విక్రయిస్తారు. అమెరికన్ దళాల ఉపసంహరణతో ఇప్పుడు దుకాణదారులు ఇతర వాణిజ్య వస్తువులను విక్రయించడం (sell) ప్రారంభించారు.

    ఇది కూడా చదవండి: బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఏమవుతుంది ? అసలు బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది?

    ఇంతకుముందే తాలిబన్లు కాబూల్ హమీజ్ కర్జాయ్ విమానాశ్రయం పేరును కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. బుర్హనుద్దీన్ రబ్బానీ యూనివర్సిటీకి కాబూల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీగా, మసూద్ స్క్వేర్‌కు కాబూల్ పబ్లిక్ హెల్త్ స్క్వేర్ అని పేరు మార్చారు. కాబూల్ మార్కెట్​లో దాదాపు 500 స్టోర్లు , స్టాల్‌లు ఉన్నాయి. కానీ, తాలిబాన్ ఇప్పుడు ప్రతిచోటా తన నియంతృత్వాన్ని నడపడం ప్రారంభించింది.

    అప్ఘనిస్తాన్ తాలిబన్ల (talibans) ఆధీనంలోకి వెళ్లిన తర్వాత.. అక్కడ ప్రజల (people) జీవితం దుర్భరంగా మారిందని వార్తలు తరచుగా వింటున్నారు. తాజాగా అప్ఘనిస్తాన్ లోని సుమారు 10 లక్షల మంది చిన్నారుల ప్రాణాలు అర చేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది చిన్నారులు (children) పోషకాహార లోపంతో ఇబ్బందులను ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్‌ (UNICEF) ఇటీవల వెల్లడించింది.



    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?


    వర్షంలో తడిచాక మీ జుట్టు పాడైపోతుంది కదా? ఈ చిట్కాలతో మీ జుట్టును కాపాడుకోండి..

    Published by:Prabhakar Vaddi
    First published: