Talibans: వారిని క్షమించాం.. ఎవరితోనూ శత్రుత్వం లేదు.. తాలిబన్ల కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

Taliban: కాబూల్‌లో పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.

  • Share this:
    తాము అందరినీ క్షమించామని.. ఇకపై ఎవరిపైనా ప్రతీకారం ఉండబోదని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తమ హస్తగతం చేసుకున్న తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన తాలిబన్ ప్రతినిధి.. తమ సహజశైలికి భిన్నంగా ప్రకటనలు చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల ఇళ్లలో సోదాలు గానీ, వారిపై దాడులు గానీ ఉండవని స్పష్టం చేశారు. మరోవైపు అప్ఘానిస్తాన్ నుంచి ఏ దేశానికి కూడా ప్రమాదం పొంచి లేదని తాలిబన్లు ప్రకటించారు. తాము అన్ని వైపులా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని అన్నారు.

    కాబూల్‌లో పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. యుద్ధ సమయంలో ప్రజలు మరియు కుటుంబాలకు జరిగిన నష్టం ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరించారు. ఇప్పుడు తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని అన్నారు. తమ నాయకుడి ఆదేశాలకు అనుగుణంగా తాము ప్రతి ఒక్కరినీ క్షమించామని అన్నారు. మాజీ సైనిక సభ్యులు, విదేశీ బలగాలతో పనిచేసిన వారితో సహా ఎవరిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోబోమని అన్నారు. వారి ఇళ్లల్లో ఎవరూ సోదాలు చేయరని అన్నారు. మహిళలకు హక్కులు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యనించారు. అప్ఘానిస్తాన్‌లో అతి త్వరలోనే ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: