Home /News /international /

TALIBANS CAPTURES ENTIRE AFGHANISTAN WHAT IS TALIBAN EFFECT ON INDIA GH SK

Taliban Effect on India: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు.. భారత్ ముందు సరికొత్త సవాళ్లు

తాలిబన్లు (ప్రతీకాత్మక చిత్రం)

తాలిబన్లు (ప్రతీకాత్మక చిత్రం)

Afghanistan: అఫ్గానిస్థాన్‌పై తాలిబన్ల ఆధిపత్యం కంటే పెద్ద సమస్యలు ప్రస్తుతం భారత్ ముందున్నాయి. భారతీయ దౌత్యవేత్తలు, సిబ్బంది, పౌరులకు రక్షణ కల్పించడం మన దేశం ముందున్న ప్రధాన సమస్య.

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దురాక్రమణ రోజురోజుకు తీవ్రమవుతోంది. అమెరికా తన బలగాలను అఫ్గాన్ నుంచి వెనక్కి పిలవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలోని ప్రావిన్సులు, నగరాలను తమ సొంతం చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి వారికి మద్దతు లభించడంతో తాలిబన్ల ఆధిపత్యం పెరుగుతోంది. ఇది భారత్‌కు కొత్త సమస్యలను తీసుకురానుంది. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతర్‌లోని దోహా వేదికగా తాలిబన్లతో అంతర్జాతీయ సమాజం రాజీలు కుదిర్చే పనిలో ఉంది. ఇప్పటికే భారత్.. చైనా, పాకిస్థాన్‌ సరిహద్ధుల వద్ద శత్రు సమస్యలను ఎదుర్కొంటోంది. తాజాగా అఫ్గాన్ ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు భారత్‌కు ఇప్పుడు క్లిష్టతరంగా మారాయి.

అఫ్గానిస్థాన్‌పై తాలిబన్ల ఆధిపత్యం కంటే పెద్ద సమస్యలు ప్రస్తుతం భారత్ ముందున్నాయి. భారతీయ దౌత్యవేత్తలు, సిబ్బంది, పౌరులకు రక్షణ కల్పించడం మన దేశం ముందున్న ప్రధాన సమస్య. అమెరికా తన బలగాలను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పిస్తుందనే వార్తలతో ఏడాది కాలంగా భారత్ కాబుల్‌తో దౌత్యపరమైన ఉనికిని తగ్గించుకుంది. 2021 ఏప్రిల్‌లో కోవిడ్-19 ప్రభావంతో భద్రత దృష్టిలో ఉంచుకొని హేరాత్, జలాలాబాద్‌లో మిషన్లలో ఉన్న భారత సిబ్బందిని స్వదేశానికి రప్పించింది. గత నెలలో కాందహార్, మజార్‌లో కాన్సులేట్లు కూడా మూసివేశారు. ప్రస్తుతం కాబూల్ రాయబార కార్యాలయం మాత్రమే అక్కడ పనిచేస్తోంది. భారతీయ పౌరులందరూ వాణిజ్య విమానాల ద్వారా వీలైనంత త్వరగా అక్కడి నుంచి రావాలని మన దేశం ఆదేశించింది.

* వ్యూహాత్మక ఆందోళనలు..
అఫ్గానిస్థాన్‌లో అధిక భాగం తాలిబన్లు ఆధిపత్యంలో ఉన్నాయి. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషేమహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న దక్షిణ ప్రావిన్సుల(అఫ్గాన్) వద్ద స్థావరాలు, శిక్షణ మైదానాలు ఏర్పరచుకున్నాయి. ఫలితంగా భారత్‌కు వ్యతిరేకంగా దాడులు చేయడానికి అపరిమిత ప్రదేశాలు ఉండే అవకాశముంది. తాలిబన్ల నియంత్రణలో ఉండటం అంటే పాకిస్థాన్ మిలిటరీ, ఇంటెలిజెన్స్ ఏజేన్సీలకు సహాయం అందించే అవకాశముందని అర్థం చేసుకోవాలి.

అంతేకాకుండా తాలిబన్ల పాలనలో.. పాకిస్థాన్‌కు అడ్డుకట్ట వేసేందుకు చౌబహార్ ఎయిర్ పోర్టులో భారత్ పెడుతున్న పెట్టుబడులకు ప్రతిఫలం లేకుండా పోతుంది. ఈ కారణంగానే అమెరికా, చైనా రెండు సొంత ప్రాజెక్టులపై దృష్టి సారించాయి. అమెరికా.. పాకిస్థాన్-ఉజ్బెకిస్థాన్-అఫ్గానిస్థాన్‌ క్వాడ్రలేటరల్ ప్రాజెక్ట్‌ను, డ్రాగన్ దేశం.. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారీడార్ (సీపీఈసీ)ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే జరాంజ్-దేలారం హైవే, సల్వా డ్యాంతో సహా భారత్ నిర్మించిన ప్రాజెక్టులు తాలిబన్ల నియంత్రణలోకి వచ్చాయి.

* రాడికలైజేషన్ ముప్పు..
తాలిబన్ల ప్రభావంతో భారత్ పరిసర ప్రాంతాల్లో పాన్- ఇస్లామిక్ టెర్రర్ గ్రూపులతో రాడికలైజేషన్ ముప్పు ఏర్పడనుంది. 1980వ దశకంలో సోవియట్‌పై పట్టుసాధించేందుకు అఫ్గానిస్థాన్‌లో ముజాహిదీన్లకు అమెరికా మద్దతు ఇచ్చింది. దీంతో ముజాహిదీన్.. సోవియట్ ఆర్మీపై విజయం సాదించింది. ఫలితంగా అల్ ఖైదా, ఐఎస్ లాంటి ఉగ్రసంస్థల ఆవిర్భావానికి దోహదం చేసింది. అంతేకాకుండా తదనంతర కాలంలో అమెరికా-ఇరాక్ యుద్ధంతో పాటు 2011 తర్వాత పశ్చిమాసియా దేశాల్లో సంక్షోభానికి దారితీసింది. చివరగా అఫ్గాన్ సంక్షోభం ప్రభావం భారత్‌పై పడనుంది. మహిళల, మైనార్టీ హక్కుల క్షీణత, ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేయడం, తాలిబన్ల క్రూరమైన న్యాయ విధానాలు లాంటి ఆందోళనలు భారత్ ముందున్నాయి.

* భారత్ ముందు నాలుగు ఆప్షన్లు..
ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం భారత్‌కు నాలుగు ఆప్షన్లు ఉన్నాయి.

1. నమ్మిన సూత్రం ఆధారంగా కాబుల్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం.

2. ఇరానియన్ మార్గం ద్వారా మందుగుండు సామాగ్రి, వాయు శక్తితో సహా సైనిక సరఫరాలను అఫ్గాన్ భద్రతా దళాలకు సప్లై చేయడం. అయితే ఇలా చేస్తే భారత్‌కు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ శుక్రవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు.

3. తాలిబన్లతో పరిచయాలను వేగవంతం చేయడం. ఇది భారత్‌కు పెద్దగా ప్రయోజనం చేకూర్చదు. ఇందుకు పాకిస్థాన్‌తో పాటు కొన్ని ప్రాంతీయ కారణాలు కూడా ఉన్నాయి.

4. చివరి ఆప్షన్.. సంఘర్షణల్లో ఎవరైతే గెలుస్తారో అంత వరకు ఎదురుచూసి అప్పడు నిర్ణయం తీసుకోవడం. ఈ ఆప్షన్ భారత్‌కు మేలు చేసే అవకాశముంది. అయితే అఫ్గాన్ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ నిర్ణయాన్ని భారత్ ఖండించింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Afghanistan, Taliban

తదుపరి వార్తలు