Home /News /international /

TALIBAN TALK PEACE AFGHAN RULERS CALL FOR PEACEFUL MEANS OF RESOLUTION TO UKRAINE RUSSIA WAR MKS

Taliban: తాలిబన్ శాంతి సందేశం -యుద్దం వద్దంటూ Russia Ukraineకు హితవు.. పుతిన్ వింటాడా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సుదీర్ఘకాలపాటు యుద్దాన్ని చవిచూసిన అఫ్గానిస్తానీలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్ ను తుపాకితో చెరబట్టిన తాలిబన్లు సైతం శాంతి వచనాలు వల్లిస్తున్నారు..

ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా సాగిస్తోన్న యుద్ధం ప్రపంచ దేశాలన్నిటినీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తున్నది. వ్యాపార, వాణిజ్యాలు దెబ్బతిని గ్లోబల్ గా పలు వస్తువుల ధరలు చుక్కల్లోకి చేరుతున్నాయి. స్వయంగా సుదీర్ఘకాలపాటు యుద్దాన్ని చవిచూసిన అఫ్గానిస్తానీలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్ ను తుపాకితో చెరబట్టిన తాలిబన్లు సైతం శాంతి వచనాలు వల్లిస్తున్నారు..

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్దం, దాని వల్ల ఏర్పడిన సంక్షోభంపై అఫ్గానిస్తాన్ పాలకులైన తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. యుద్దం వద్దని, శాంతి నెలకొనాలని తాలిబన్లు ఆకాంక్షించారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆటగదరా శివ! -బయట బాంబుల వర్షం.. బంకర్‌లో పురుడుపోసుకున్న మహిళ: Russia Ukraine war


ఉక్రెయిన్ లో పరిస్థితులు, ఆ దేశంపై రష్యా యుద్ధం పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఉక్రెయిన్ లో ప్రాణ నష్టంపై తీవ్రంగా ఆదందోళన చెందుతున్నామని ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్‌ అఫ్గానిస్తాన్’ పాలకులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో అఫ్గాన్ తటస్థ విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని, అయితే హింసను తీవ్రతరం చేసే విధానాలను రష్యా, ఉక్రెయిన్ మానుకోవాలని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Ahmedabad: ఎదురింట్లో వృద్ధురాలిని చూస్తూ రోజూ హస్త ప్రయోగం.. వాడికి భార్య, ఇద్దరు బిడ్డలు!




ఇప్పటికే పలు దేశాలు రష్యాకు హితవు చెప్పగా, ఇప్పుడు తాలిబన్లు సైతం శాంతి వచనాలు వల్లెవేశారు. గతేడాది జరిగిన నాటకీయ పరిణామాల్లో.. అమెరికా సైన్యాలు వెళ్లిపోయిన తర్వాత అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు వశం చేసుకోవడం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 15న అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. దేశం పేరును ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్‌ అఫ్గానిస్తాన్’గా మార్చేసి పరిపాలన కొనసాగిస్తుండటం తెలిసిందే. కనీసం తాలిబన్ల మాటయినా పుతిన్ వింటాడా? లేదా? చూడాలి.
Published by:Madhu Kota
First published:

Tags: Afghanistan, Russia-Ukraine War, Taliban

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు