TALIBAN SHUT KEY MONEY EXCHANGE MARKET IN KABUL PVN
Taliban : తాలిబన్ మరో కీలక నిర్ణయం..ఉపాధి కల్పించకపోగా..ఉన్న ఉపాధి కోల్పోయేలా..
ప్రతీకాత్మక చిత్రం
Afghanistan : కొత్తగా ఉపాధి కల్పించకపోగా..ఉన్న ఉపాధిని కూడా దూరం చేస్తూ తాలిబన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద నగదు మార్పిడి(Money-Exchange)మార్కెట్ ని తాజాగా తాలిబన్ మూసివేసింది. దీంతో దీనిపై ఆధారపడిన వందల మంది చిరు వ్యాపారులు రోడ్డు మీద పడ్డారు.
Taliban : అఫ్ఘనిస్తాన్(Afghanistan)లో పరిపాలన కొనసాగిస్తున్న తాలిబన్ కొత్త కొత్త నిర్ఱయాలతో తరుచుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అప్ఘనిస్తాన్ లో తాలిబన్లను చూసి కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు తాలిబన్లు అధికారంలోకి వచ్చాక చాలా మంది వ్యాపారులు కూడా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ దేశంతో చాలా దేశాల వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో తమకు సాయమందించండంటూ పలు దేశాలను అభ్యర్థిస్తున్నారు తాలిబన్లు. భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే పలు రకాలుగా అప్ఘన్ కు సాయమందించిన విషయం తెలిసిందే. ఇక,అప్ఘనిస్తాన్ లో ఉపాధి దొరక్క ప్రజలు నానా కష్టాలు పడుతున్న సమయంలో తాలిబన్ తీసుకున్న నిర్ణయం అక్కడి ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. కొత్తగా ఉపాధి కల్పించకపోగా..ఉన్న ఉపాధిని కూడా దూరం చేస్తూ తాలిబన్ తీసుకున్న నిర్ణయం ఉందని వాపోతున్నారు.
తాలిబన్ తీసుకున్న ఆ నిర్ణయమేంటీ
రాజధాని కాబూల్ లోని ప్రధానమైన దేశంలోనే అతిపెద్ద నగదు మార్పిడి(Money-Exchange)మార్కెట్ ని తాజాగా తాలిబన్ మూసివేసింది. కాబూల్ నగరంలోని సరాయ్ షాజాదా ఏరియాలోని బోలి మార్కెట్ కు తాలిబన్ ప్రభుత్వం సోమవారం మూసివేయడంతో దీనిపై ఆధారపడిన వందల మంది చిరు వ్యాపారులు రోడ్డు మీద పడ్డారు. బోలి మార్కెట్ లో పెద్ద మొత్తంలో నగదు మార్పిడి జరుగుతుంది,అలాగే విదేశీ కరెన్సీలకు ఆఫ్ఘని నగదు విలువ నిర్ణయించబడుతుంది.
బోలి మార్కెట్ ని మూసివేయడం వల్ల డజన్ల కొద్దీ విక్రేతలు తమ ఉద్యోగాలను కోల్పోయారని మరియు విదేశీ కరెన్సీలకు ఆఫ్ఘని యొక్క నిజమైన విలువను నిర్ణయించడంలో సమస్యలకు దారితీస్తుందని అనేక మంది విక్రేతలు చెప్పినట్లు స్థానిక వార్తా సంస్థ టోలో న్యూస్ తెలిపింది. ఇప్పుడు తాము తమ దగ్గరున్న డబ్బును డాలర్లుగా లేదా పాకిస్థానీ రూపాయిలుగా మార్చుకోలేకపోతున్నామని స్థానిక విక్రేత ఫరీద్ అహ్మద్ అన్నారని టోలో న్యూస్ తెలిపింది. ప్రజలు జీవనోపాధి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వం బోలి మార్కెట్‌ను మూసివేసింది అని మరొక విక్రేత సయ్యద్ హషీమ్ అన్నారు.
గత కొద్ది నెలలుగా, ముఖ్యంగా గతేడాది డిసెంబర్లో డాలర్‌తో పోలిస్తే ఆఫ్ఘని కరెన్సీ విలువ పడిపోయినప్పుడు కూడా బోలి మార్కెట్ మూసివేయబడింది. అయితే, సరాయ్ షాజాదా మార్కెట్లో వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి అనుమతించారు. ఇప్పుడు, విక్రేతలను తిరిగి మార్కెట్ కి ఎప్పుడు అనుమతిస్తారో స్పష్టంగా తెలియని పరిస్థితి ఏర్పడిందని టోలో న్యూస్ తెలిపింది. ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వం(తాలిబన్ ప్రభుత్వం) నిర్ణయం మేరకు సరాయ్ షాజాదాలోని బోలి మార్కెట్‌ను మూసివేసినట్లు సరాయ్ షాజాదాలోని మనీ ఎక్స్ఛేంజర్స్ యూనియన్ తెలిపింది. యూనియన్ ప్రకారం.. కొద్ది రోజుల క్రితమే ఇస్లామిక్ ఎమిరేట్ మంత్రుల మండలి ఆర్థిక సంఘం బోలి మార్కెట్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకుందని టోలో న్యూస్ నివేదించింది.
మరోవైపు ,అఫ్ఘనిస్తాన్(Afghanistan)లో చాలా మందికి పనులు దొరక్కపోవడంతో తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి..శరీరంలోని అవయవాల(Vital organs)ను అమ్ముకుంటున్నారు. ఇంతటి దయనీయ పరిస్థితి అక్కడి వాళ్లను పేదవాళ్లగానే కాకుండా అనారోగ్యవంతులుగా మార్చడానికి కారణవుతోంది. ముఖ్యంగా పశ్చిమ ప్రావిన్స్‌లోని హెరాత్ ( Herat province)ప్రాంతానికి చెందిన చాలా మంది తమ భార్య, పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. మరికొందరు వలసలు వెళ్లేందుకు అప్పులు చేసి వాటిని తీర్చడానికి శరీరంలోని కిడ్నీలు అమ్ముకోవాల్సిన దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.