TALIBAN SEIZE MI 35 CHOPPER GIFTED BY INDIA TO AFGHANISTAN AT KUNDUZ AIRBASE REPORT SU
Taliban: ఇండియా ఇచ్చిన గిఫ్ట్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు..! అరాచకత్వంతో అట్టుడుతుకుతున్న అఫ్గానిస్తాన్
ప్రతీకాత్మక చిత్రం
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వారి అరాచకత్వంతో ఆ దేశం అట్టుడుకుతోంది. అఫ్ఘానిస్తాన్ నుంచి విదేశీ బలగాలు దశల వారీగా వెనక్కి వెళ్లడం మొదలైనప్పటీ నుంచి తాలిబన్లు.. తమ అక్రమణలు కొనసాగిస్తున్నారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వారి అరాచకత్వంతో ఆ దేశం అట్టుడుకుతోంది. అఫ్ఘానిస్తాన్ నుంచి విదేశీ బలగాలు దశల వారీగా వెనక్కి వెళ్లడం మొదలైనప్పటీ నుంచి తాలిబన్లు.. తమ అక్రమణలు కొనసాగిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. అఫ్గాన్ దళాలు వైమానిక దాడులకు పాల్పడుతున్నప్పటికీ తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌లోని 65 శాతం భూభాగాలను తాలిబన్లు వారి నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అఫ్గాన్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న కుందుజ్‌లోని విమానాశ్రయాన్ని కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అఫ్గాన్‌కు భారత్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఎంఐ-35 హెలికాఫ్టర్‌ను తాలిబన్లు వారి ఆధీనంలోకి తీసుకన్నట్టుగా కథనాలు వెలువడుతున్నారు.
అయితే 2019లో భారత ప్రభుత్వం .. నాలుగు హెలికాఫ్టర్లను అఫ్గాన్‌ను బహుమతిగా అందజేసింది. అఫ్గాన్ తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీటిని అందించింది. ప్రస్తుతం వాటిలో ఒకదానిని తాలిబన్లు స్వాధీనం చేసుకన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే.. హెలికాఫ్టర్‌ను తాలిబన్లు నిర్వీర్యం చేసి ఉంటారని.. ప్రస్తుతం అది ఎగిరే స్థితిలో లేదని వార్త కథనాలు వెలువడుతున్నాయి.
ఇందుకు సంబంధించి స్పందించడానికి భారత రక్షణ శాఖ వర్గాలు నిరాకరించాయి. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాలపై తాము మాట్లాడలేమని పేర్కొన్నాయి. ఇక, కుందుజ్ నగరాన్ని ఆదివారం తాలిబన్లు వారి ఆధీనంలోకి తీసుకన్నారు. ఆ తర్వాత వారు.. విమానాశ్రయం, ఇతర స్థావరాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. మరోవైపు అఫ్గాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఆ దేశ క్రికెటర్ రషీద్ ఖాన్.. ప్రపంచ నేతల సాయం కోరాడు. తమను అరాచకత్వంలో వదిలేయొద్దని.. అఫ్గాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు చొరవ తీసుకోవాలని ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశాడు. పిల్లలు, మహిళలు సహా పౌరులు ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఫ్గాన్ నాశనం కాకుండా చూడాలని.. తమకు శాంతి కావాలని అన్నాడు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.