Home /News /international /

TALIBAN SEARCHED CLOSED INDIAN CONSULATES IN AFGHANISTAN CITIES KANDAHAR HERAT TOOK AWAY PARKED CARS SU

Afghanistan News: షాకింగ్.. భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు.. చివరకు వాటిని తీసుకెళ్లిపోయారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు కోరుకుంటున్నామని తాలిబన్లు పైకి చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

    ఆదివారం అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. తాము విజయం సాధించినట్టుగా ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు కోరుకుంటున్నామని తాలిబన్లు పైకి చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా దేశాలు తమ దౌత్య కార్యాలయాలను ఖాళీ చేశాయి. అధికారులను, సిబ్బందిని స్వదేశాలకు తీసుకెళ్లాయి. అంతేకాకుండా అఫ్గాన్‌లో ఉన్న తమ పౌరులను కూడా సురక్షితంగా స్వదేశాలకు చేర్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాయి. అందులో భారత్ కూడా ఉంది. భారత్ ఇప్పటికే అఫ్గాన్‌లోని దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి సిబ్బందిని స్వదేశానికి చేర్చింది. అయితే అఫ్గాన్‌లో చిక్కుపోయిన భారతీయులను రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది.

    ఇదిలా ఉంటే తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌, హెరాత్‌ నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో గత బుధవారం తాలిబన్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసిందని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కాందహార్‌‌లో దౌత్య కార్యాలయంలో అల్మారాలో ఏమైనా పేపర్స్‌ దొరుకుతాయా అని తాలిబన్లు వెతికారు. అయితే వారికి ఎటువంటి పత్రాలు లభించలేదు. దీంతో కాందహార్, హెరాత్‌లలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలను తీసుకెళ్లారు.

    చదవండి: Shabnam Dawran: తాలిబన్ల అరాచకం.. మహిళా న్యూస్ యాంకర్‌కు చేదు అనుభవం.. వీడియో‌లో ఆవేదన

    Explained: Afghanistan New Rulers: తాలిబన్ల ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించనున్న వ్యక్తులు ఎవరు? వారి నేపథ్యం ఏంటి?

    ‘తాలిబన్ల ఈ చర్యలను తాము ముందే ఊహించాం. పత్రాల కోసం సెర్చ్ చేసిన అధికారులు.. రెండు కార్యాలయాల నుంచి వాహనాలను తీసుకెళ్లారు’అని ఓ సీనియర్ అధికారి చెప్పినట్టుగా ఎన్డీటీవీ తెలిపింది. ఇక, భారత్ అఫ్గానిస్తాన్‌లో.. కాబూల్‌లోని రాయబార కార్యాలయంతో పాటుగా నాలుగు దౌత్య కార్యాలయాలను నిర్వహించింది. ఇక, ప్రస్తుతం కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మాత్రం అధికారికంగా మూసివేయలేదు. స్థానికుల సాయంతో దీనిని నిర్వహిస్తున్నారు. కాందహార్, హెరాత్ కాకుండా మిగిలిన రెండు దౌత్య కార్యాలయాల్లో తాలిబన్లు సోదాలు చేశారా..? లేదా..? అనే దానిపై స్పష్టత లేదు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Afghanistan, India, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు