Women Education: మహిళలు పీజీలు.. పీహెచ్ డీలు చేయొచ్చు.. కానీ అది తప్పని సరి

మహిళల చదువుకి తాలిబన్ల గ్రీన్ సిగ్నల్

Condition for Education: ఎప్పటిలాగే మహిళలు మళ్లీ కాలేజీలకు వెళ్లొచ్చు.. వారికి నచ్చినది చదువుకోచ్చు.. కానీ ఈ నిబంధన మాత్రం తప్పని సరి అంటూ ఆఫ్గనిస్తాన్ లో కండిషన్ పెట్టారు తాలిబన్లు..

 • Share this:
  Taliban to allow Wome to study in Universities: మహిళల పట్ల తమ వైఖరేంటో మరోసారి స్పష్టం చేశారు తాలిబన్లు. అఫ్గనిస్తాన్ (Afghanistan) మహిళలు కేవలం పిల్లల్ని కంటే చాలన్నారు తాలిబన్ల  (Taliban) అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి. వారికి పదవులేవీ అవసరం లేదన్నారు. అటు చదువుకునే మహిళలు బుర్ఖాలు ధరించాలని విద్యాశాఖ మంత్రి అబ్దుల్ హక్కానీ ప్రకటించారు. అఫ్ఘానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. మహిళలను పిల్లలను కనే మిషన్‌ మాదిరిగానే భావిస్తున్నారు. అఫ్గాన్‌ మహిళలు కేవలం పిల్లల్ని కంటే చాలని, వారికి మంత్రి పదవులు అనవసరమని తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి అన్నారు. తాలిబన్‌ సర్కారులో తమకు స్థానం కల్పించాలని కోరుతూ అక్కడి మహిళలు రోజురోజుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన జెక్రుల్లా మహిళలు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ఇలాంటి బాధ్యత వారికి అప్పగిస్తే.. తలపై మోయలేనంత బరువు మోపినట్లే అవుతుందన్నారు. మహిళా నిరసనకారులు దేశంలోని మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించలేరన్నారు. గతంలో మహిళలకు చోటిచ్చారని. 20 ఏళ్లుగా ఆఫీసుల్లో జరిగింది వ్యభిచారమేనంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా విద్యపై తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీలో మహిళలు చదువుకునేందుకు అనుమతినిస్తూ ప్రపంచాన్ని నివ్వెర పరిచారు. నిజానికి తాలిబన్ల గత పాలనను దృష్టిలో ఉంచుకుని మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తారని, ఇక వారు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టే తాలిబన్ల వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మహిళలకు పదవులు అవసరం లేదని.. కేవలం పిల్లలు కనే మిషన్లు అంటూ చెప్పుకొచ్చిన తాలిబన్లు.. చదువు విషయంలో మాత్రం అందరి అంచనాలను తారుమారు చేశారు. మహిళా విద్యకు అనుమతి ఇచ్చారు. అయితే ఓ కండిషన్ కూడా పెట్టారు.

  ఇదీ చదవండి: ముంబైలో ఆగని దారుణాలు.. రైల్వే స్టేషన్‌లో బాలికపై అత్యాచారం

  యూనివర్సిటీల్లో మహిళలు చదువుకునేందుకు అనుమతించిన తాలిబన్లు కొన్ని షరతులు మాత్రం విధించారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు తరగతులు ఉంటాయని మాత్రం స్పష్టం చేశారు. మహిళలు తప్పనిసరిగా ఇస్లామిక్ సంప్రదాయ దుస్తులే ధరించాలన్న నిబంధన కూడా విధించారు.

  ఇదీ చదవండి: బరువు తగ్గడానికి న్యాచురల్ రెమిడీ ఇది.. రోజూ ఈ జ్యూస్ తాగితే చాలు..

  బోధనాంశాల్లోనూ మార్పులు చేస్తామని తాలిబన్ మధ్యంతర ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియమితుడైన అబ్దుల్ హక్కానీ తెలిపారు. తాలిబన్ల తాజా ప్రకటనపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాబూల్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ సదస్సులో ఈ ప్రకటనను స్వాగతిస్తూ తాలిబన్ జెండాలను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
  Published by:Nagesh Paina
  First published: