Rahimullah Haqqani Killed : అప్ఘానిస్తాన్(Afghanistan)లో తాలిబన్(Taliban)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ఘాన్ రాజధాని కాబూల్ జిల్లాలోని గురువారం జరిగిన తాలిబన్ ఆత్మాహుతి దాడిలో తాలిబన్ మత గురువు షేక్ రహిముల్లా హక్కానీ(Rahimullah Haqqani )మరణించారు. కాబూల్‌లోని ఆయన మదర్సాలోకి చొరబడిన దుండగుడు ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో రహీముల్లా హక్కానీ మృతిచెందాడు. కాబుల్ పోలీస్ ప్రతినిధి ఖలీద్ జర్దాన్.. హుక్కానీ మృతిని ధ్రువీకరించారు. ఈ దాడిలో హక్కానీ సొదరుడు కూడా మరణించారని,మరో ముగ్గురు ఇతరులు గాయపడ్డారని ఖలీద్ తెలిపారు. అప్ఘాన్ లో తాలిబన్లు రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. గతంలో కాలు కోల్పోయిన వ్యక్తి ప్లాస్టిక్ కృత్రిమ కాలులో దాచిన పేలుడు పదార్థాలను ఉంచి హక్కానీ ఇంటిలోకి చొరబడి తనను తాను పేల్చుకున్నాడని తాలిబన్ ప్రభుత్వ డిప్యూటీ అధికార ప్రతినిధి బిలాల్ కరీమీ తెలిపారు. దేశంలోని గొప్ప విద్యావేత్త షేక్ రహీముల్లా హక్కానీ శత్రువుల క్రూరమైన దాడిలో అమరవీరుడు కావడం చాలా బాధాకరం అని కరీమీ ఆవేదన వ్యక్తం చేశారు.
తాలిబాన్ అధికారులు సోషల్ మీడియా వేదికగా హక్కానీ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేశారు. అప్ఘానిస్తాన్ లో బాలికలు పాఠశాలలకు వెళ్లి చదువుకునేందుకు అనుమతించబడటానికి అనుకూలంగా ఇటీవల బహిరంగంగా మాట్లాడిన రహీముల్లా హక్కానీ ..గతంలో రెండు సార్లు హత్యాప్రయత్నాల నుండి తప్పించుకున్నాడు హక్కానీ. 2020లో పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
Kim Jong UN : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలొకి కిమ్ ఎంట్రీ..ఇక వార్ వన్ సైడే!
కాగా,హక్కానీపై ఆత్మాహుతి దాడి చేసి చంపింది పాల్పడింది తామేనని ఐసిస్(ISIS)తన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ప్రకటించుకుంది. షేక్ రహిముల్లా హక్కానీ...ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవిని కలిగి లేనప్పటికీ, హక్కానీ ఒక ప్రభావవంతమైన వ్యక్తి అని తాలిబాన్ వర్గాలు తెలిపాయి, అతను సంవత్సరాలుగా గ్రూప్ సభ్యులలో చాలా మందికి బోధనలు చేసినట్లు తెలిపారు. హక్కానీ..హదీత్ సాహిత్యంలో పండితుడిగా చెబుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Bomb blast, ISIS, Taliban