హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan: చనిపోయినా వదలరు.. మృతదేహాలతో శృంగారం.. తాలిబన్ల క్రూరత్వాన్ని బయటపెట్టిన మహిళ

Afghanistan: చనిపోయినా వదలరు.. మృతదేహాలతో శృంగారం.. తాలిబన్ల క్రూరత్వాన్ని బయటపెట్టిన మహిళ

ముఖ్యంగా మహిళల(Woman) హక్కులకు కనీసం విలువ ఇవ్వని తాలిబాన్లు ఇప్పటికే విద్యాతో పాటు ఉద్యోగాలకు 

సంబంధించి అనేక నిబంధనలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా కార్యాలయాలకు రాకుండా హుకుం జారీ చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)

ముఖ్యంగా మహిళల(Woman) హక్కులకు కనీసం విలువ ఇవ్వని తాలిబాన్లు ఇప్పటికే విద్యాతో పాటు ఉద్యోగాలకు సంబంధించి అనేక నిబంధనలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా కార్యాలయాలకు రాకుండా హుకుం జారీ చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)

Afghanistan: ముస్కాన్ అనే మహిళ అప్ఘానిస్తాన్ పోలీస్ విభాగంలో పనిచేశారు. దేశాని తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత.. వారి రాక్షస పాలనకు బయటపడి ఇండియాకు వచ్చారు. కాబూల్‌ నుంచి వచ్చి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు.

తాలిబాన్లు అంటేనే అరాచకత్వానికి మారు పేరు.  మహిళలు చదువుకోకూడదు. ఉద్యోగం చేయకూడదు. పురుషుల తోడు లేనిదే బయటకు రాకూడదు. బుర్ఖా ఖచ్చితంగా ధరించాలి. అందరూ షరియ చట్టాన్ని పాటించాలి. లేదంటే కఠిన శిక్షలు.. బహిరంగ ఉరితీతలు.. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల రూల్స్ ఇవి.   కేవలం ఇవే కాదు.. మహిళలను సెక్స్ బానిసలుగా మార్చేస్తారు. పదేళ్ల బాలికలను పెళ్లి చేసుకొని బలవంతంగా అనుభవిస్తారు. తాలిబాన్ల రాక్షసత్వం గురించి ప్రపంచానికి తెలిసిన నిజాలివి. కానీ తాలిబాన్లు ఇంతకంటే క్రూరులని.. ఆప్ఘానిస్తాన్ నుంచి భారత్‌కు శరణార్థిగా వచ్చిన ఓ మహిళ బయటపెట్టింది. చనిపోయిన తర్వత కూడా వదలిపెట్టరట. మహిళల మృతదేహాలతో కూడా సెక్స్ చేస్తారట. వినడానికే ఎంతో జుగుప్సాకరంగా ఉంది కదా.. కానీ ఇదే నిజమంటోంది అప్ఘానిస్తాన్ మహిళా పోలీస్.

ముస్కాన్ అనే మహిళ అప్ఘానిస్తాన్ పోలీస్ విభాగంలో పనిచేశారు. దేశాని తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత.. వారి రాక్షస పాలనకు బయటపడి ఇండియాకు వచ్చారు. కాబూల్‌ నుంచి వచ్చి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు.  తాలిబన్ల పాలన ఎలా ఉంటుంది? వారి అరాచకాలు ఎలా ఉంటాయి? మహిళలను ఎలాంటి చిత్రహింసలకు గురిచేస్తారు? అనే వివరాలను న్యూస్18తో పంచుకున్నారు ముస్కాన్.


'' తాలిబన్ల ఆక్రమణ తర్వాత మాకు ఎన్నో హెచ్చరికలు వచ్చాయి. ఎవరైనా మహిళ ఒకవేళ ఉద్యోగం చేస్తే.. ఆమెకు , ఆమె ఫ్యామిలీకి ముప్పు పొంచి ఉన్నట్లే.  ఒక్కసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్లీ ఇవ్వరు. ఆ తర్వాత చంపేయడమే. తుపాకులతో కాల్చేస్తారు. మహిళలను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి చంపేస్తారు. మరణించిన తర్వాత కూడ వదలరు. మృతదేహాలతోనూ శృంగారం జరుపుతారు. వారు బతికి ఉన్నారా? మరణించారా? అని కూడా చూడరు. క్రూరమృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తారు. ప్రతి కుటుంబం నుంచి వారికి మహిళలు కావాలి. నిన్న కూడా ఓ యువతిని ఎత్తుకెళ్లి చంపేశారు. అందుకే వారికి భయపడి ఉద్యోగాన్ని వదలిపెట్టి వచ్చేశాను.'' అని ముస్కాన్ పేర్కొన్నారు.


2018లో అప్ఘాన్ నుంచి భారత్‌కు వచ్చిన మరో మహిళ కూడా తాలిబాన్ల రాక్షల పాలన గురించి వివరించారు. పోలీస్ విభాగంలో పనిచేస్తున్నందుకు తన తండ్రి కాల్చిచంపారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు తన మామ అప్ఘాన్ ఆర్మీలో డాక్టర్‌గా పనిచేస్తున్నందుకు చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని తెలిపారు. గత ఏడాది ఖతెరా అనే మహిళ కూడా ఉద్యోగానికి వెళ్లి తిరిగి వస్తుండగా తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. అప్పుడామె రెండు నెలల గర్భిణి. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఆమె ఇండియాకు వచ్చి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐదు నెలల బాబుతో ఇక్కడే ఉంటున్నారు. మరికొన్ని రోజుల్లో అప్ఘాన్‌కు వెళ్లిపోవాలని అనుకుంటున్న తరుణంలోనే తాలిబాన్లు ఆక్రమించేశారు. ఈ సందర్భంగా వారి అరాచకాల గురించి న్యూస్‌18కు చెప్పారు ఖతెరా. మహిళలను చంపి శవాలను కుక్కలకు విసిరేస్తారని  ఆమె తెలిపారు.

Sharia Law: తాలిబాన్లు పాటించే.. షరియా చట్టం ఏం చెబుతోంది? మహిళలపై ఉన్న కఠిన ఆంక్షలేంటి?

తాలిబాన్ల పాలన నేపథ్యంలో అక్కడి మహిళలు భయం భయంగా బతుకుతున్నారు. ఈ క్రమంలోనే తమ స్కూల్లో చదివిన విద్యార్థినుల రికార్డులను షబానా బాస్జి రాసిఖ్ అనే ఓ పాఠశాల వ్యవస్థాపకురాలు తగులబెట్టారు. తాలిబన్ల నుంచి ఆ విద్యార్థినులతో పాటు వారి కుటుంబాలను రక్షించడానికే ఇలా చేశామని వెల్లడించారు. కనీసం ఆ పిల్లల భవిష్యత్తుకైనా భద్రత ఉంటుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఎంతో బాధతో వాటిని తగులబెట్టానని, లేదంటే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని కంటతడి పెట్టుకున్నారు.


Taliban: తాలిబన్ల తొలి ఫత్వా ఇదే.. దానిపై నిషేధం..వీళ్లు మారలేదు.. మారినట్లు నటిస్తున్నారు

First published:

Tags: Afghanistan, Kabul, Taliban