కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. తాలిబన్ ప్రభుత్వాధినేతగా ముల్లా బరాదర్ పేరును శుక్రవారం ఖరారు చేసినట్లు తెలిసింది. ముల్లా బరాదర్ తాలిబన్ ఇస్లామిస్ట్ గ్రూప్‌కు సహ వ్యవస్థాపకుడు కావడం గమనార్హం. ఆ సంస్థ తరపున ఇన్నాళ్లూ బరాదర్ రాజకీయ కార్యకలాపాలు చూసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే బరాదర్ పేరుతో కాబూల్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం.
తాలిబన్ అగ్ర నేతలంతా కాబూల్‌కు చేరుకున్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని తాలిబన్ ప్రతినిధి చెప్పడం గమనార్హం. ఇప్పటికే తాలిబన్లు ఆప్ఘన్ కీలక నగరమైన కాబూల్‌ను ఆగస్ట్ 15న స్వాధీనం చేసుకున్నారు.
తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో అక్కడ మహిళలు కొందరు ధైర్యం చేసి రోడ్డెక్కి తమ హక్కుల కోనం నినదిస్తున్నారు. గతంలో తాలిబన్ల పాలనలో ఎంతో వివక్ష ఎదుర్కొన్న అక్కడి మహిళలు ఈసారి మాత్రం తమ హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని కొందరు తాలిబన్లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. తాలిబన్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో ముల్లా మహ్మద్ యాకూబ్, షేర్ మహ్మద్ అబ్బాస్ స్టాన్జాయ్‌లకు కూడా కీలక పదవులు దక్కనున్నాయి.
తాలిబన్ ప్రభుత్వాన్ని నడిపించబోతున్న బరాదర్ దుర్రానీ పష్తూన్ తెగలో జన్మించాడు. కాందహార్‌లోనే పెరిగాడు. ముల్లా ఒమర్‌తో కలిసి సోవియట్ సేనలపై తిరగబడ్డాడు. అఫ్గానిస్తాన్ నుంచి సోవియట్ సేనలు వెళ్లిపోయాక అక్కడ అంతర్యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. అప్పుడే బరాదర్.. ముల్లా ఒమర్‌తో కలిసి తాలిబన్‌ను స్థాపించాడు. 1996 నుంచి 2001 వరకూ ఆప్ఘన్‌లో సాగిన తాలిబన్ల పాలనలో బరాదర్ కీలక పాత్ర పోషించాడు.
اطلاعاتو او کلتور وزارت په #کابل کې د کابینې اعلانولو په خاطر پر دېوالونو د شعارونو کښل او په ښار کې د بیرغونو پورته کولو بهیر پیل کړ. pic.twitter.com/9rwWdmi7gT
— Ahmadullah Muttaqi (@Ahmadmuttaqi01) September 3, 2021
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తాలిబన్ సంస్థలో కీలక నేతగా ఉన్న స్టాన్జాయ్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గత 20 ఏళ్లలో ఆప్ఘనిస్తాన్‌లో ఏర్పడిన ప్రభుత్వాల్లో భాగమైన ఏ ఒక్కరినీ తాలిబన్ ప్రభుత్వంలో భాగం కానిచ్చేది లేదని స్టాన్జాయ్ స్పష్టం చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, International news, Taliban