Home /News /international /

TALIBAN CAPTURE SHEBERGHAN CITY IN JAWZJAN SECOND AFGHAN PROVINCIAL CAPITAL SU

Afghanistan: అఫ్ఘానిస్తాన్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. వారి ఆధీనంలోకి మరో ప్రావిన్షియల్ రాజధాని

ప్రతీకాత్మక చిత్రం(photo: Reuters)

ప్రతీకాత్మక చిత్రం(photo: Reuters)

అఫ్ఘానిస్తాన్‌పై తాలిబన్లు క్రమంగా పట్టుబిగిస్తున్నారు. మే నెల నుంచి అఫ్ఘానిస్తాన్ నుంచి విదేశీ బలగాలు దశల వారీగా వెనక్కి వెళ్లడం మొదలైనప్పటీ నుంచి తాలిబన్లు.. తమ ప్రణాళికలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

    అఫ్ఘానిస్తాన్‌పై తాలిబన్లు క్రమంగా పట్టుబిగిస్తున్నారు. మే నెల నుంచి అఫ్ఘానిస్తాన్ నుంచి విదేశీ బలగాలు దశల వారీగా వెనక్కి వెళ్లడం మొదలైనప్పటీ నుంచి తాలిబన్లు.. తమ ప్రణాళికలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా భీకర దాడులతో రెచ్చిపోతున్నారు. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. శుక్రవారం తాలిబన్లు.. నిమ్రోజ్‌ ప్రావిన్షియల్‌ రాజధాని జెరాంజ్‌ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోనే తాలిబన్లు మరో ప్రావిన్షియల్ రాధానిని తమ ఆధీనంలోకి తెచ్చుకన్నారు. శనివారం జవ్జాన్ లోని షెబెర్ఘాన్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్టుగా డిప్యూటీ గవర్నర్ ఖాదర్ మాలియా తెలిపారు. ప్రభుత్వ దళాలు, అధికారులు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. ఉత్తర అఫ్ఘాన్ నగర శివార్లలోని విమానాశ్రయానికి వెళ్లినట్టుగా చెప్పారు. మరోవైపు తాలిబన్లు కూడా షెబెర్జాన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు.

    ఇక, అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల, భద్రతా బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తాలిబన్లు తీవ్రమైన దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ మీడియా విభాగానికి చెందిన ఉన్నతాధికారి దవాఖాన్ మీనాపాల్‌ను కూడా తాలిబన్లు హత్య చేశారు. కాబూల్‌లో శుక్రవారం తాలిబన్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఓ ప్రార్థన మందిరంలో ఆయనను కాల్చి చంపారు. అలాగే నేతలను లక్ష్యంగా చేసుకుని కూడా తాలిబన్లు దాడులు చేస్తున్నారు.

    ఇక, అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో తమ పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని అమెరికా, బ్రిటన్‌లు కోరాయి. అఫ్ఘానిస్తాన్‌లో అమెరికన్లకు భద్రతాపరమైన రక్షణ కల్పించడం పరిమితంగా మారిందని కాబూల్‌లోని యుఎస్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే వీలైనంత త్వరగా అమెరికన్లు అఫ్ఘానిస్తాన్‌ నుంచి వెళ్లిపోవాలని కోరింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Afghanistan, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు