Home /News /international /

Taliban మరో సంచలన నిర్ణయం -Afghanistanలో విదేశీ క‌రెన్సీపై నిషేధం -US దెబ్బకు మరోదారిలేక..

Taliban మరో సంచలన నిర్ణయం -Afghanistanలో విదేశీ క‌రెన్సీపై నిషేధం -US దెబ్బకు మరోదారిలేక..

అఫ్గాన్ లో విదేశీ కరెన్సీ నిషేధం

అఫ్గాన్ లో విదేశీ కరెన్సీ నిషేధం

కష్టాల్లో కొట్టుమిట్టాడే ప్రజల నెత్తిన మరో పెద్ద కష్టాన్ని రుద్దితే.. అప్పటిదాకా అనుభవించిన బాధలు చిన్నగా కనిపిస్తాయనే దుర్నీతిని తాలిబన్లు కూడా అనుసరిస్తున్నారు. అఫ్గానిస్థాన్ లో జనం ఆకలి కేకలు, ఉగ్రదాడులతో భీతిల్లుతుంటో.. విదేశీ కరెన్సీ రద్దు చేస్తూ ప్రజల నెత్తిన మరో పిడుగు వేశారు..

ఇంకా చదవండి ...
చూడబోతే తాలిబన్లు ప్రపంచ రాజకీయాలను తొందరగాగే తలకెక్కించుకున్నట్లున్నారు. కష్టాల్లో కొట్టుమిట్టాడే ప్రజల నెత్తిన మరో పెద్ద కష్టాన్ని రుద్దితే.. అప్పటిదాకా అనుభవించిన బాధలు చిన్నగా కనిపిస్తాయనే దుర్నీతిని వాళ్లు కూడా అనుసరిస్తున్నారు. దేశంలో జనం ఆకలి కేకలు, ఉగ్రదాడులతో భీతిల్లుతుంటో.. విదేశీ కరెన్సీ రద్దు చేస్తూ ప్రజల నెత్తిన మరో పిడుగు వేశారు తాలిబన్ పాలకులు. సాధారణంగా ఏ దేశంలోనైనా సొంత కరెన్సీపైనే ఆర్థిక వ్యవహారాల గమనం ఉంటుంది. కానీ అమెరికా యుద్ధం తర్వాత అఫ్గాన్ ఎకానమీలో 60శాతానికిపైబడి విదేశీ మారక ద్రవ్యమే చెలామణిలో ఉంది. దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత విదేశీ సాయం పూర్తిగా నిలిచిపోయిన క్రమంలో ఈ నిర్ణయం ప్రజల పాలిట శాపంగా మారనుంది..

అఫ్గానిస్థాన్ లో విదేశీ కరెన్సీ వినియోగం, మార్పిడిపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్ సర్కారు బుధవారం ప్రకటించింది. ఇప్పటికే పతనం అంచున ఉన్న అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది అదరను షాక్ కానుంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందునే తామీ నిర్ణయం తీసుకోక తప్పలేదని తాలిబన్లు చెబుతున్నారు. ఇకపై అఫ్గాన్ వాసులంతా దేశీయ కరెన్సీని మాత్రమే వినియోగించాలని, వర్తక, వాణిజ్యాలు, రవాణాలో నిర్వహించే లావాదేవీలు మొత్తం అఫ్గాన్ కరెన్సీలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్ కరెన్సీ వాడరాదని, ఒకవేళ వాడినట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మీడియాకు తెలిపారు.

అమెరికా సేనలు అఫ్గాన్ గడ్డపై ఉన్న 20 ఏళ్లూ.. అక్కడ దేశీయ కరెన్సీ కంటే సాదారణ కలాపాలకు కూడా డాలర్లను వినియోగించేవాళ్లు. ఇప్పుడు అమెరికా సేనలు వెళ్లిపోవడంతో డాలర్ల సరఫరా నిలిచిపోయింది. పైగా అఫ్గాన్ కు చెందిన సొమ్ము పెద్ద మొత్తంలో అమెరికా దగ్గరే అటకాయించింది. తాలిబన్లను బూచిగా చూపుతూ అఫ్గానిస్థాన్ పై ఆర్థిక ఆంక్షలు విధించింది అమెరికా. అఫ్గాన్ ఎకానమీలో మెజార్టీ వాటాను ఆక్రమిస్తోన్న విదేశీ కరెన్సీని రద్దుచేయడం ద్వారా అమెరికాకు కౌంటరిచ్చినట్లు తాలిబన్లు భావిస్తున్నప్పటికీ, ఆ నిర్ణయం లక్షల మంది అఫ్గాన్లను పేదరికంలోకి నెట్టేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

అమెరికా ఫెడ్ వద్ద దాదాపు 9 బిలియన్ డాలర్ల అఫ్గాన్ రిజర్వులు ఉన్నా.. ఆర్థిక ఆంక్షల వల్ల తాలిబన్లు వాటిని పొందలేకపోతున్నారు. సదరు నిధుల విడుదల కోసం తాలిబన్లు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అటు ప్రంపచ బ్యాంకు, ఐఎంఎఫ్ సైతం అఫ్గాన్ కు నిధుల సరఫరాను పూర్తిగా ఆపేసింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థను నడపటం తాలిబన్ పాలకులకు తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వేతర విదేశీ కరెన్సీ లావాదేవీలు కొనసాగుతున్న దరిమిలా వాటిని పూర్తిగా నిషేధించి, కేవంల దేశీ కరెన్సీనే బలోపేతం చేసుకునే దిశగా తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Afghanistan, Currency, Taliban

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు